ఇటీవల కాలంలో కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధ పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.ఆహారపు అలవాట్లు, పోషకాల లోపం, అధిక ఒత్తిడి, ఓవర్ వెయిట్, వాటర్‌ను సరిగ్గా తీసుకోకపోవడం, పలు రకాల మందుల వాడకం, జీవన శైలిలో మార్పులు, మద్యపానం ఇలా రకరకాల కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి.
దాంతో రాళ్లను కరిగించుకునేందుకు హాస్పటల్స్ చుట్టూ తిరుగుతూ నానా ఇబ్బందలు పడతాయి.అయితే మందులతో కాకుండా న్యాచురల్ పద్ధతుల్లోనూ కిడ్నీలో రాళ్లను నివారించుకోవచ్చు.
ముఖ్యంగా రణపాల మొక్క మీ ఇంట్లో ఉంటేచాలా ఈజీగా కిడ్నీ స్టోన్స్‌ను నివారించుకోవచ్చు.సాధారణంగా రణపాల మొక్కను ఇంటి పరిసరాల్లో, ఆఫీసల వద్ద అలకరణ కోసం పెంచుతుంటారు.
కానీ, ఆయుర్వేద పరంగా ఈ మొక్క ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.ముఖ్యంగా కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారు రణపాల మొక్క యొక్క ఆకులను రెండేసి చప్పున ఉదయం, సాయంత్రం బాగా నమిలి మింగాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే మూత్ర పిండాల్లో ఏర్పడి న రాళ్లు క్రమ క్రమంగా కరిగి పోతాయి.మరియు ఇతర కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నా తగ్గు ముఖం పడతాయి.
మధుమేహం వ్యాధి గ్రస్తులకు కూడా రణపాల ఆకులు గొప్ప ఔషధంగా పని చేస్తాయి.రణపాల ఆకులతో తయారు చేసిన కషాయాన్ని రోజుకు ముప్పై ఎమ్ఎల్ చప్పున తీసుకుంటే.రక్తంలో చక్కెర స్థాయిలు ఎల్లప్పుడూ అదుపులో ఉంటాయి.అలాగే రణపాల ఆకుల కషాయాన్ని సేవించడం వల్ల రక్త పోటు స్థాయిలు అదుపు తప్పకుండా ఉంటాయి.
అంతేకాదు, రణపాల ఆకులను రోజుకు రెండు చప్పున బాగా నమిలి తింటే. హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.
గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి త్వరగా విముక్తి లభిస్తుంది.
ఇక కామెర్లు ఉన్న వారు రణపాల ఆకుల కషాయాన్ని తీసుకుంటే త్వరగా కోలుకుంటారు.