కేరళ సినిమా ఇండస్ట్రీలో ( Kerala film industry )నటీమణులకు ఎలాంటి భద్రత ఉండదనే ఒక ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది.మహాత్మ ( Mahatma )(2009) మూవీ ఫేమ్ భావన ( Bhavana )2017లో తనని కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించారని సంచలన ఆరోపణలు చేసింది.
దీని తర్వాత ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) ఒక గ్రూప్ ఏర్పాటయింది.ఈ గ్రూపు ఒక పిటిషన్ కూడా వేసింది.
దాని తర్వాత ఇతర యాక్ట్రెస్‌లు కూడా ఇలాంటి గురవుతున్నారా, వారికి భద్రత ఉందో లేదో తేల్చాలంటూ కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ ( Justice Hema )కమిషన్ లేదా కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ ఆగస్టు 19న ఒక రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది.
ఈ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న లైంగిక వేధింపులను బట్టబయలు చేసింది.చాలా మంది మహిళలను పని ప్రారంభించకముందే లైంగిక కోరికలు తీర్చాలంటూ ఇండస్ట్రీలోని కొంతమంది వేధించినట్లు ఈ రిపోర్ట్ తెలిపింది.
ఫిమేల్ యాక్టర్స్ బట్టలన్నీ విప్పేసి పక్కలో పడుకుంటేనే పని, పైసలు ఇచ్చేవారని, లేకపోతే ఇండస్ట్రీ నుంచి నిర్దాక్షిణ్యంగా గెంటేసేవారని ఈ రిపోర్టు చాలామంది అనుభవాల ఆధారంగా తెలియజేసింది.అప్పటినుంచి భారతదేశవ్యాప్తంగా మాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయా అంటూ వార్తలు పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నాయి.
మహిళలను మరీ అంగడి సరుకుగా బాలీవుడ్ ఇండస్ట్రీ చూస్తోందని దానిపై చాలామంది దుమ్మెత్తి పోస్తున్నారు.
నిజానికి ఒక్క మాలీవుడ్‌లోనే( Mollywood ) కాదు ఇలాంటి పరిస్థితులు మిగతా సినిమా ఇండస్ట్రీల్లో కూడా ఎదురవుతుంటాయి.అయితే ఈ రిపోర్ట్ మాత్రం సందేహాలకు ఏమాత్రం తావులేకుండా ఫిమేల్ ప్రొఫెషనల్స్‌కి ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో బయట పెట్టింది.దాని ప్రకారం నటీమణులకు భద్రత, టాయిలెట్స్ ఉండవు.
ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి పక్కలో పడుకోవాలి.లేకపోతే వెంటనే ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తారు.
తక్కువ జీతం ఇస్తారు.వర్కింగ్ అవర్స్ ఎప్పుడు పడితే అప్పుడు ఉంటాయి.
లైంగికంగానే కాదు మహిళల శ్రమను కూడా దోచుకుంటారు.బడా హీరోయిన్లు తప్ప మిగతా వారందరినీ అన్ని విషయాల్లో కాంప్రమైజ్ చేసే లాగా ఫోర్స్ చేస్తారు.
కంప్లైంట్ ఇస్తే వేధింపులు ఎక్కువ అవుతావు.ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తారు.
జస్టిస్ హేమ కొంతమంది నటీమణుల అనుభవాలను కూడా రిపోర్టులో పొందుపరిచింది కానీ ప్రైవసీ నిమిత్తం మళ్ళీ వారి పేర్లను తొలగించింది.అయితే కేరళ ఇండస్ట్రీలో కనీసం మహిళలందరూ ఒకటయ్యి కామాంధుల ఆగడాలపై పోరాడుతున్నారు కానీ మిగతా ఇండస్ట్రీల్లో కనీసం వేధింపులు, వివక్షతల మీద గొంతు ఎత్తే వాళ్లే లేరు.ఒక సినిమా ఇండస్ట్రీలోనే మాత్రమే కాదు అన్ని రంగాల్లో మహిళలను వేధించే కామాంధులు ఎక్కువైపోతున్నారు.ఒక్క రంగానికే ఇలాంటి కఠిన చట్టాలు తీసుకురావడానికి బదులుగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రంగాలలోని మహిళలను కాపాడే లాగా కఠినమైన చట్టాలను తీసుకురావాలి.
ఒక్కరే పోరాటం చేస్తే వారికి వేధింపులు, ఆఫర్స్ లాస్ కావడం వంటి సమస్యలు రావచ్చు.కాబట్టి మహిళలందరూ ఒక్కటి కావాలి.ఇలాంటి నీచులకు వ్యతిరేకంగా తిరగబడాలి.తమని తామే రక్షించుకోవడానికి పోరాడాలి.