గత కొన్ని సంవత్సరాలుగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Young Tiger Jr.NTR)వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ జనరేషన్ ప్రేక్షకులు ఇష్టపడే కథలకు ఓకే చెప్పడం జూనియర్ ఎన్టీఆర్కు ప్లస్ అయిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న తారక్ ఈ ఏడాది వార్2(War2) సినిమాను రిలీజ్ చేయనున్నారు.
యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో(Under the banner of Yash Raj Films) అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.త్వరలో ఈ సినిమాకి సంబంధించి అధికారిక అప్డేట్స్ రానున్నాయి.

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.మ్యాడ్, ఆయ్, మ్యాడ్2 (Mad, Aye, Mad2)సినిమాలతో నార్నె నితిన్ విజయాలను అందుకున్నారు.వరుసగా రొమాంటిక్ ఎంటర్టైనర్లలో నటించడం నార్నె నితిన్(narne nithin) కు ప్లస్ అయిందని చెప్పవచ్చు.జూనియర్ ఎన్టీఆర్ రొమాంటిక్ ఎంటర్టైనర్లలో నటించాలని నార్నె నితిన్ కు సూచించారని తెలుస్తోంది.
నార్నె నితిన్ భవిష్యత్తు సినిమాలతో ఏ స్థాయిలో సక్సెస్ సాధిస్తారో చూడాల్సి ఉంది.మ్యాడ్2 సినిమా సక్సెస్ మీట్ కు ఎన్టీఆర్ హాజరు కానుండటం గమనార్హం.నిర్మాత నాగవంశీపై(producer Naga Vamsi) ఉన్న అభిమానం కూడా ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కు హాజరు కావడానికి కారణమని తెలుస్తోంది.ఎన్టీఆర్ నెల్సన్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

వరుస విజయాలతో నార్నె నితిన్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలో పెరిగిందని తెలుస్తోంది.నార్నె నితిన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.నార్నె నితిన్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.వరుస విజయాలు సాధిస్తున్నా సింపుల్ గా ఉండటానికి నార్నె నితిన్ ఇష్టపడుతున్నారు.