రాజీవ్ కనకాల (Rajeev Kanakala)పరిచయం అవసరం లేని పేరు నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న ఈయన ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లు అంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.త్వరలోనే ఈయన నటించిన హోమ్ టౌన్ అనే సిరీస్ విడుదల కాబోతుంది.
ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవుతున్నారు.ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రాజీవ్ కనకాల జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha)హోస్ట్గా వ్యవహరిస్తున్న కిసిక్ టాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తన వ్యక్తి గత విషయాల గురించి ఈయన మాట్లాడారు.

ఈ సందర్భంగా వర్ష రాజీవ్ కనకాలను ప్రశ్నిస్తూ గతంలో మీరు సుమ(Suma) గారితో విడాకులు తీసుకుంటున్నారు అంటూ వార్తలు వచ్చాయి.నిజమేనా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు రాజీవ్ సమాధానం చెబుతూ నేను నా భార్య ఎందుకు విడాకులు తీసుకొని విడిపోతాము ఈ విషయం తెలిసి మేము కూడా ఆశ్చర్యపోయాము.
అంతేకాకుండా మా పిల్లలు వచ్చి ఎందుకు విడిపోతున్నారు అంటూ మమ్మల్ని నిలదీశారు అప్పుడు మా దగ్గర ఎలాంటి సమాధానం లేదని ఈయన విడాకులపై క్లారిటీ ఇచ్చారు.

ఇక సుమ గారితో గొడవ పడితే ముందుగా ఎవరు మాట్లాడుతారు అంటూ వర్షా ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు రాజీవ్ సమాధానం చెబుతూ ఎవరు గొడవపడిన ముందు నేనే మాట్లాడాలని సుమా అంత తొందరగా మాట్లాడదని చాలా మొండిదని తెలిపారు.నేను ఏదైనా చిలిపి చేష్టలు చేస్తేనే సుమ కూల్ అవుతుందని రాజీవ్ కనకాల ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్(Ntr) గురించి కూడా ఈయన పలు విషయాలు తెలిపారు.ఎన్టీఆర్ రాజీవ్ కనకాల ఇద్దరు చాలా మంచి స్నేహితులనే విషయం మనకు తెలిసిందే.
ఇక ఎన్టీఆర్ మంచిగా వంట చేస్తారనే సంగతి తెలిసిందే.అయితే తారక్ పైనాపిల్ కర్రీ చాలా అద్భుతంగా చేస్తారు.
నాకు ఆ కర్రీ అంటే చాలా ఇష్టం రెసిపీ కనుక యూట్యూబ్లో పెడితే ప్రతి ఒక్క ఇంట్లో కూడా అదే కర్రీ చేసుకుంటారు అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.