రోజు బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని తీసుకుంటే ఎంత లావుగా ఉన్న వారైనా నాజూగ్గా మారతారు!

ప్రస్తుత రోజుల్లో అధిక బరువు( Over Weight ) సమస్యతో బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు.బరువు పెరగడానికి అనేక కారణాలు ఉన్నట్లే తగ్గడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.

 If You Take This Smoothie For Breakfast You Will Become Slimmer Details, Smooth-TeluguStop.com

ముఖ్యంగా కొన్ని కొన్ని స్మూతీలు( Smoothie ) వెయిట్ లాస్ కు చాలా అద్భుతంగా తోడ్పడతాయి.ఇప్పుడు చెప్పబోయే స్మూతీ కూడా ఆ కోవకే చెందుతుంది.

రోజు బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని తీసుకుంటే ఎంత లావుగా ఉన్న వారైనా నాజూగ్గా మారతారు.మరి ఇంతకీ ఆ స్మూతీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్( Rolled Oats ) వేసి వాటర్ పోసి అర గంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టిన ఓట్స్ వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్,( Chia Seeds ) వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, పావు టీ స్పూన్ అల్లం పొడి, చిన్న దాల్చిన చెక్క, ఐదు నుంచి ఆరు నానబెట్టి పొట్టు తొలగించిన‌ బాదం పప్పు వేసుకోవాలి.

Telugu Tips, Latest, Oatspapaya, Smoothie-Telugu Health

చివరిగా అరకప్పు బొప్పాయి పండు ముక్కలు,( Papaya ) అర అరటిపండు( Banana ) మరియు ఒక క‌ప్పు వాటర్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.తద్వారా మన ఓట్స్ పపాయ బనానా స్మూతీ అనేది సిద్ధమవుతుంది.ఈ స్మూతీ ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా ఎన్నో పోషకాలను సైతం కలిగి ఉంటుంది.

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని కనుక తీసుకుంటే మధ్యాహ్నం లంచ్ వరకు ఆకలి అన్న ఫీలింగ్‌గే ఉండదు.

Telugu Tips, Latest, Oatspapaya, Smoothie-Telugu Health

ఆహార కోరికల‌ను ఈ స్మూతీ అణ‌చివేస్తుంది.రోజంతా మిమ్మల్ని ఫుల్ ఎన‌ర్జిటిక్ గా ఉంచుతుంది.జీవక్రియ రేటును పెంచుతుంది.

దాంతో కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి.ఫలితంగా మీరు వెయిట్ లాస్ అవుతారు.

ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే తప్పకుండా ఈ ఓట్స్ పపాయ బనానా స్మూతీని డైట్ లో చేర్చుకోండి.కావాలి అనుకుంటే మీరు బొప్పాయి, అరటిపండుకు బదులుగా అవకాడో, యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, పైనాపిల్‌ తదితర పండ్లను కూడా ఉపయోగించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube