పిల్ల‌ల‌కు ఉడికించిన శనగలను రోజూ పెడితే ఆ జ‌బ్బ‌లు ద‌రిచేర‌వ‌ట‌?

శ‌న‌గ‌లువీటి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.దాదాపు అంద‌రి ఇళ్ల‌ల్లోనూ శ‌న‌గ‌ల‌ను విరి విరిగా ఉప‌యోగిస్తుంటారు.

 Health Benefits Of Boiled Chana For Children! Health, Benefits Of Boiled Chana,-TeluguStop.com

ముఖ్యంగా పూజలు చేశారంటే ఖ‌చ్చితంగా నైవేద్యంగా ఉడికించిన శ‌న‌గ‌ల‌ను సమర్పిస్తారు.ఉడికించిన శ‌న‌గ‌లు రుచిగా ఉండ‌ట‌మే కాదు బోలెడ‌న్ని పోష‌కాల‌ను సైతం క‌లిగి ఉంటాయి.

అందుకే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.అందులోనూ పిల్ల‌ల‌కు రోజూ ఉడికించిన శ‌న‌గ‌ల‌ను పెడితే చాలా మంచ‌ద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మ‌రి లేటేందుకు పిల్ల‌ల‌కు ఉడికించిన శ‌న‌గ‌ల‌ను ఇవ్వ‌డం వ‌ల్ల వ‌చ్చే బెనిఫిట్స్ ఏంటో చూసేయండి.

సాధార‌ణంగా పిల్ల‌ల్లో ప్రోటీన్ కొర‌త అత్య‌ధికంగా క‌నిపిస్తుంది.

అయితే శ‌న‌గ‌ల్లో ప్రోటీన్ పుష్క‌లంగా ఉంటుంది.అందు వ‌ల్ల‌, రోజూ గుప్పెడు ఉడికించిన శ‌న‌గ‌ల‌ను పిల్ల‌ల‌కు పెడితే వారిలో ప్రోటీన్ కొర‌తే ఉండ‌దు.

చాలా మంది పిల్ల‌లు త‌ర‌చూ మ‌ల‌బ‌ద్ధ‌కానికి గుర‌వుతుంటాయి.అయితే ఉడికించిన శ‌న‌గ‌ల‌ను పెడితే.

అందులో ఉండే ఫైబ‌ర్ కంటెంట్ జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరును చురుగ్గా మార్చి మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని ద‌రి దాపుల్లోకి రాకుండా అడ్డుకుంటుంది.

Telugu Benefitsboiled, Boiled Chana, Tips, Latest-Telugu Health - తెలు�

అలాగే శ‌న‌గ‌ల్లో స‌మృద్ధిగా ఉండే పోష‌కాల్లో కాల్షియం ఒక‌టి.అందువ‌ల్ల‌, పిల్ల‌ల‌కు రోజూ గుప్పెడు ఉడికించిన శ‌న‌గ‌లు ఇస్తే.ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా పెరుగుతాయి.దాంతో వారి ఎదుగుద‌ల అద్భుతంగా ఉంటుంది. పిల్ల‌ల్లో ర‌క్త హీన‌త కూడా ఎక్కువ‌గా క‌నిపించే స‌మ‌స్య‌.అయితే ఉడికించిన శ‌న‌గ‌లు రెగ్యుల‌ర్‌గా తీసుకుంటే.అందులో ఉండే ఐర‌న్ కంటెంట్ శ‌రీరానికి అంది ర‌క్త వృద్ధి జ‌రుగుతుంది.

దాంతో ర‌క్త హీన‌త దూరం అవుతుంది.

ఇక పిల్ల‌ల‌కు ఉడికించిన శనగలను రోజూ పెట్ట‌డం వ‌ల్ల‌.

వారి మెడ‌దు చురుగ్గా, వేగంగా ప‌ని చేస్తుంది.అల‌స‌ట‌, నీర‌సం వంటి స‌మ‌స్య‌లు వారిని వేధించ‌కుండా ఉంటాయి.

రోజంతా యాక్టివ్ ఉంటారు.రోగ నిరోధ‌క శ‌క్తి రెట్టింపు అవుతుంది.

మ‌రియు నిద్ర కూడా బాగా ప‌డుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube