ప్రస్తుతం మనకు అందుబాటులో ఎన్నో రకాల ఆయిల్స్ ఉన్నాయి.అందులో ఆలివ్ ఆయిల్ ఒకటి.
ఆరోగ్యానికి, చర్మానికి, కేశాలకి ఇలా అన్ని విధాలుగా ఆలివ్ ఆయిల్ ఉపయోగపడుతుంది.ఎన్నో ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది.
ఆలివ్ పండ్ల నుంచి తయారు చేసే ఈ ఆలివ్ ఆయిల్‌లో విటమిన్స్, మాక్రో న్యూట్రియంట్స్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి.అందుకే మంచి ఆరోగ్యం కోసం చాలా మంది ఆలివ్ ఆయిల్‌ను వంటలకు ఉపయోగిస్తాయి.
అయితే ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిదని తెలుసు.కానీ, ఎలా వాడితే మంచిది.? ఎప్పుడు వాడితే మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు అన్నది చాలా మందికి అవగాహన ఉండదు.
వాస్తవానికి పరగడుపున ఆలివ్ ఆయిల్ తీసుకుంటే.
బోలెడన్ని బెనిఫిట్స్ పొందడంతో పాటుగా అనేక జబ్బులకు కూడా దూరంగా ఉండొచ్చు.ముఖ్యంగా ఖాళీ కడుపుతో ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ చప్పున ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవడం వల్ల.
రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది.దాంతో గుండె జబ్బులు దరి చేరకుండా ఉండడంతో పాటు రక్త పోటు కూడా అదుపులో ఉంటుంది.

అలాగే పరగడుపున ఒక స్పూన్ చప్పున ఆలివ్ ఆయిల్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే.అందులో ఉండే పలు పోషకాలు లివర్‌ను శుభ్రపరిచి దాని పని తీరును మెరుగుపడేలా చేస్తాయి.మరియు లివర్ డ్యామేజ్, ఇతర లివర్ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పట్టేలా చేస్తుంది.అధిక బరువుతో బాధ పడే వారికి కూడా ఆలివ్ ఆయిల్ గ్రేట్‌గా సహాయపడుతుంది.
పరగడుపున రెండు స్పూన్ల నిమ్మ రసానికి ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి తీసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే కొవ్వు కరిగి.
బరువు తగ్గుతారు.పరగడుపున ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.
దాంతో సీజనల్‌గా వచ్చే రోగాలకు దూరంగా ఉండొచ్చు.మరియు పలు రకాల క్యాన్సర్ల నుంచి కూడా రక్షణ లభిస్తుంది.
ఇక ఖాళీ కడుపుతో రెగ్యులర్‌గా ఆలివ్ ఆయిల్‌ను తీసుకుంటే.చర్మానికి, కేశాలకు కూడా ఎంతో మేలు.