శానిటైజర్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారా.. రోగాలను కొని తెచ్చుకున్నట్లే జాగ్రత్త..!

శానిటైజర్లను( Sanitiser ) అధికంగా ఉపయోగిస్తున్నారా, అయితే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే.రసాయన అధిక వాడకం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 Do You Use Too Much Sanitizers Be Careful Like Buying Diseases , American Scient-TeluguStop.com

వాటికి బదులు నీరు, సబ్బును వాడుకోవాలని చెబుతున్నారు.కోవిడ్ తర్వాత శానిటైజర్ల వినియోగం ఎక్కువైన విషయం దాదాపు చాలామందికి తెలిసిందే.

వీటిపై అమెరికా శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి అతి వాడకం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.

క్వాటర్నరీ అమ్మోనియం కాంపౌండ్స్ గా పిలుచుకునే యాంటీ మైక్రోబయాల్‌ రసాయనాలను అధికంగా ఉపయోగిస్తే రోగాల బారిన పడతారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఈ రసాయనాలను ఎక్కువగా ఉపయోగిస్తే పర్యావరణానికి కూడా హాని కలుగుతుందని చెబుతున్నారు.శానిటైజర్లకు బదులు ప్రత్యామ్నాయాల పై దృష్టి పెట్టాలని చెబుతున్నారు. ఉబ్బసం( Asthma ), చర్మ వ్యాధులకు వీటి వాడకానికి మధ్య సంబంధం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.శాస్త్రవేత్తలు ముందుగా జంతువులపై ప్రయోగాలు చేశారు.

Telugu American, Asthma, Tip, Tips, Sanitiser, Skin Diseases-Telugu Health Tips

ఈ పరిశోధనలలో పిల్లలు పుట్టకపోవడం, పుట్టిన పిల్లల్లో అవయ లోపాలు తదితర సమస్యలకు శానిటైజర్లకు సంబంధం ఉన్నట్లు కూడా గుర్తించినట్లు హెచ్చరిస్తున్నారు.క్వాటర్నరీ అమ్మోనియం కాంపౌండ్స్ యాంటీ మైక్రోబయల్ రోగనిరోధకత( Immunization )ను అడ్డుకుంటాయని 1950లోనే గుర్తించారు.దీని కారణంగా వివిధ వ్యాధులకు విరుగుడుగా వాడే యాంటిబయాటిక్‌లు పనిచేయవు.వీటివల్ల భవిష్యత్తులో మరణాల సంఖ్య పెరిగే ఆస్కారం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

Telugu American, Asthma, Tip, Tips, Sanitiser, Skin Diseases-Telugu Health Tips

అంతేకాకుండా బెంజల్‌కోనియమ్‌ క్లోరైడ్‌ ఈ కోవాకు చెందిన రసాయన పదార్థమే అని చెబుతున్నారు.కానీ దీన్ని అమ్మోనియం క్లోరైడ్ పేరిట మార్కెట్లో విక్రయిస్తున్నారని చెబుతున్నారు.పంట ఉత్పత్తులకు వాడే రసాయనాల లేబుళ్ల పై వీటి గురించి కచ్చితంగా ఉంటుంది.రంగులోను వీటిని వాడుతున్నప్పటికీ డబ్బాలపై వీటి గురించి రాయడం లేదు.సరైన పద్ధతిలో పరీక్షించకుండానే మార్కెట్లోకి వదులుతున్నారు.ఈ రసాయనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube