నాగచైతన్యకు( Naga Chaitanya ) సపోర్ట్ చేస్తూ ఎన్టీఆర్( NTR ) ప్రచారం చేయడం ఏంటి? చైతన్య నటించిన సినిమాలు ఏవి ఇప్పుడు విడుదలకు సిద్ధంగా లేవు కదా! మరి ఎన్టీఆర్ ఏ విషయంలో నాగచైతన్యకు సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తున్నాడు అని ఆశ్చర్యపోతున్నారా! అయితే ఇక్కడ మ్యాటర్ సినిమాది కాదండోయ్.ఫుడ్ విషయం.
నాగచైతన్యకు సంబంధించిన రెస్టారెంట్ ను ఎన్టీఆర్ ప్రమోట్ చేస్తున్నారట.అది కూడా జపాన్ లో( Japan ) ప్రమోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా చైతన్యకు షోయు అనే క్లౌడ్ కిచెన్ ఉన్న సంగతి తెలిసిందే.ఇది పూర్తిగా జపాన్ రుచుల్ని అందిస్తుంది.

చైతూకు వ్యక్తిగతంగా జపాన్ రుచులంటే ఇష్టం కాబట్టి ఈ రెస్టారెంట్ తెరిచాడు.ఇప్పుడీ రెస్టారెంట్( Restaurant ) గురించి జపాన్ లో ఉన్న ఎన్టీఆర్, అక్కడి ఆడియన్స్ కు చెబుతున్నాడు.సూషీ వంటకం అంటే నాకు చాలా ఇష్టం.నాలా అది ఎవరికైనా ఇష్టమైతే, వాళ్లకు నేను ఒక మంచి రికమండేషన్ అందిస్తాను.హైదరాబాద్ లో నా ఫ్రెండ్ నాగచైతన్య షోయు( Shoyu ) అనే రెస్టారెంట్ పెట్టాడు.ది బెస్ట్ జపనీస్ ఫుడ్ మీకు అక్కడ దొరుకుతుంది అంటూ నాగచైతన్య రెస్టారెంట్ ని ప్రమోట్ చేస్తున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా( Devara ) జపాన్ లో విడుదల అయిన సందర్భంగా ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో భాగంగా జపాన్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.అందులో భాగంగానే నాగచైతన్య రెస్టారెంట్ కూడా ప్రమోట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్.ఇకపోతే తారక్ విషయానికి వస్తే.ఇటీవలే దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి సూపర్ హిట్టుగా నిలిచింది.ఈ సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ ని సైతం బ్రేక్ చేశారు తారక్.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు.







