సాధారణంగా మనం ఏ గురువు వద్దనైనా విద్యాబుద్ధులు నేర్చుకుంటే అందుకు మూల్యంగా గురువుకు గురుదక్షిణ చెల్లిస్తాము.అయితే ఈ సాంప్రదాయం అనాదిగా వస్తూనే ఉంది.
అప్పట్లో ఎంతో మంది రాజకుమారులు తమ గురువుల వద్ద విద్యాబుద్ధులు నేర్చుకుని వారికి ఎంతో విలువైనవి గురుదక్షిణగా చెల్లించేవారు.మరి లోక సంరక్షణార్థం దశావతారాలు ఎత్తిన శ్రీహరి కూడా ఈ భూమిపై ఎనిమిదవ అవతారంగా శ్రీ కృష్ణుడుగా జన్మించాడు.
ఈ విధంగా జన్మించిన శ్రీకృష్ణుడు కూడా గురువు దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకుని అతనికి గురుదక్షిణ చెల్లించాడు.అయితే శ్రీకృష్ణుడు చెల్లించిన గురుదక్షిణ వెలకట్టలేనిదని చెప్పవచ్చు.
ఇంతకీ శ్రీకృష్ణుడు గురువు కు ఎలాంటి గురుదక్షిణ చెల్లించుకున్నాడనే విషయానికి వస్తే.
బాలకృష్ణుడు విద్యాబుద్ధులను నేర్చుకోవడం కోసం సాందీపుని ఆశ్రమంలో చేరాడు.
సాందీపుని మహర్షి ఆశ్రమంలో విద్యాబుద్ధులను నేర్చుకుంటూ ఇతర విద్యార్థులతో కలిసి ఆశ్రమంలో అవసరమైన సేవలను చేస్తూ ప్రియ శిష్యుడిగా మెప్పు పొందాడు.ఈ విధంగా ఆశ్రమంలో సకల శాస్త్ర విద్యాబుద్ధులు నేర్చుకున్న శ్రీ కృష్ణుడు గురుదక్షిణగా సాందీపుని మహర్షికి ఏమైనా చెల్లించాలని భావించాడు.
తన మనసులో ఉన్న మాటలను తన గురువు దగ్గర ఉంచగా అందుకు గురుపత్ని కన్నీరుమున్నీరవుతున్న తనకు గురుదక్షిణగా ప్రభాస తీర్థంలో తప్పిపోయిన తమ కుమారుడిని గురుదక్షిణగా ఇవ్వమని చెప్పింది. అయితే గురు మాత అడిగిన గురు దక్షిణ కష్టసాధ్యమైనప్పటికీ శ్రీకృష్ణుడు ఆ గురుదక్షిణ చెల్లించుకోవడానికి వెనకాడలేదు.

ప్రభాస తీర్ధం వద్ద ఉన్న సముద్రంలో సాందీపుని కుమారుడు స్నానమాచరిస్తూ ఉండగా అతనిని పాంచజన్యమనే రాక్షసుడు అపహరించుకుపోయారు.విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు అతనితో భీకరంగా పోరాటం చేసి ఆ రాక్షసుడిని అంతమొందించి అతని చెరనుంచి సాందీపుని కుమారుడిని రక్షించి తీసుకు వచ్చి గురుదక్షిణగా చెల్లించాడు.ఈ విధంగా ప్రపంచంలో ఎవరూ కూడా తమ గురువుకు వెలకట్టలేని గురుదక్షిణ ను చెల్లించి శ్రీ కృష్ణుడు చరిత్రలో నిలిచారు.