ఇది మరో బేబీ మూవీ అంటున్న బాక్సాఫీస్ వర్గాలు

ఈ ఏడాది వచ్చిన చిన్న చిత్రాల్లో బాహుబలి రేంజ్ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘బేబీ’ అనడం లో సందేహం లేదు. ఆనంద్‌ దేవరకొండ ( Anand Deverakonda )హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్‌ గా నటించిన బేబీ సినిమా కు యూత్‌ బ్రహ్మరథం పట్టారు.

 Mad Movie Box Office Collections Like Baby Movie , Mad Movie , Baby Movie, To-TeluguStop.com

దాదాపుగా వంద కోట్ల వసూళ్లు నమోదు చేసిన బేబీ ట్రెండ్‌ సెట్టర్ గా నిలిచింది అనడంలో సందేహం లేదు.

Telugu Baby, Mad, Telugu, Sitara, Telugu Box-Movie

బేబీ మాదిరిగా మరే సినిమా కూడా వసూళ్లు చేయలేదేమో అనుకుంటూ ఉండగా అనూహ్యంగా మ్యాడ్‌ సినిమా( Mad movie ) వచ్చింది.సితార ఎంటర్‌ టైన్మెంట్స్ బ్యానర్‌ లో నాగ వంశీ( Naga Vamsi ) ఈ సినిమా ను నిర్మించాడు.ముగ్గురు స్నేహితులు కాలేజ్ లో చేసే అల్లరి తో ఈ సినిమా నిండి ఉంటుంది.

జాతిరత్నాలు సినిమాలో కూడా ముగ్గురు స్నేహితుల మధ్య కథ ఉంటుంది.ఇప్పుడు మ్యాడ్‌ లో కూడా అదే సీన్ రిపీట్ అయింది.

దాంతో వసూళ్లు కూడా అదే విధంగా రిపీట్ అవ్వబోతున్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు చాలా నమ్మకంతో చెబుతున్నారు.

Telugu Baby, Mad, Telugu, Sitara, Telugu Box-Movie

ఇప్పటి వరకు ఈ ఏడాది బేబీ సినిమా( Baby movie ) వసూళ్లు చిన్న సినిమాల్లో అత్యధికంగా ఉన్నాయి.ఇప్పుడు ఆ రికార్డ్‌ ను మ్యాడ్‌ దక్కించుకున్నా ఆశ్చర్యం లేదు.దసరా పండుగ వచ్చే వరకు అంటే మరో రెండు వారాల వరకు పెద్ద సినిమా లు ఏమీ లేవు.

కనుక ఈ రెండు వారాలు మరియు దసరా సీజన్ లో కూడా మ్యాడ్‌ సినిమా మంచి వసూళ్లు దక్కించుకుంటే కచ్చితంగా బేబీ రేంజ్ లో మ్యాడ్‌( Mad movie ) కి భారీ వసూళ్లు నమోదు అయినట్లే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బాక్సాఫీస్ వద్ద మ్యాడ్‌ మొదటి రోజే మంచి డీసెంట్‌ కలెక్షన్స్ ని రాబట్టింది.

దాంతో ముందు ముందు ఏ రేంజ్‌ లో మ్యాడ్‌ ( Mad movie )దూకుడు ఉంటుందో చెప్పనక్కర్లేదు.మ్యాడ్‌ తో పాటు వచ్చిన సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.

కనుక ఈ సినిమా కు అది కూడా ఒక కలిసి వచ్చే పాయింట్‌ అయింది.వంద కోట్ల క్లబ్‌ లో మ్యాడ్‌ నిలిస్తే అద్భుతమే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube