హ్యాండ్సమ్ హీరో సూర్య గజినీ సినిమా( Ghajini )తో అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు.చాలా బాగా నటిస్తాడు, అందగాడు కాబట్టి ఈ హీరోకి కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా పెరిగిపోయింది.
సూర్య ఘటికుడు, వీడొక్కడే, బందోబస్త్, ఆరు, సూర్యపుత్రుడు, సూర్య సన్నాఫ్ కృష్ణన్, నువ్వు నేను ప్రేమ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించాడు.ఇవన్నీ తమిళంలో వచ్చినవే.
సూర్య వీటిని తెలుగులో డబ్ చేసి ఇక్కడ కూడా హిట్స్ కొట్టాడు.
సూర్య ఏ పాత్ర వేసినా దానికి కరెక్ట్ గా సూట్ కాగలడు.ఉదాహరణకు సెవెంత్ సెన్స్( 7th Sense ) లో బోధిధర్మ పాత్రలో సూర్య చాలా బాగా సెట్ అయ్యాడు.ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి వావ్ అనిపించాడు.24 సినిమాలో మూడు పాత్రల్లో అతడు చూపించిన వేరియేషన్స్ కి చాలామంది ఫిదా అయిపోయారు.సూర్య తమిళంలో దాదాపు గొప్ప దర్శకులందరితో కలిసి పనిచేశాడు.
ఈ నటుడి “సింగం” ఫిలిం సిరీస్ తెలుగులోనూ హిట్ అయింది.ఇప్పుడు సూర్య “కంగువ( Kanguva ) అనే ఒక భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయిపోయాడు.
ఈ సినిమా హిట్ అయితే సూర్య పాన్ ఇండియా స్టార్ అయిపోతాడు.
అయితే రజనీకాంత్, విజయ్, ధనుష్, కమల్ హాసన్, అజిత్ లాగా ఇండియా లెవెల్ లో స్టార్ హీరో కాలేకపోయాడు సూర్య.దీనికి ప్రధాన కారణం అతను ఓన్లీ తమిళ దర్శకులతో మాత్రమే సినిమాలు తీయడం అని చెప్పుకోవచ్చు.ఒకవేళ ఈ హీరో తెలుగు, హిందీ దర్శకులతో కలిసి సినిమాలు తీసి ఉంటే అతడి మార్కెట్ బాగా పెరిగి ఉండేది.
భారతదేశ వ్యాప్తంగా సూర్య స్టార్ హీరో అయిపోయి ఉండేవాడు.నిజానికి తమిళ సినిమాల వరకు సూర్యకి మంచి పేరు ఉంది.కోలీవుడ్ స్టార్ హీరోలందరితో సమానంగా అతనికి క్రేజ్ కూడా ఉంది.కానీ వాళ్ళ లాగా ఇతనికి పెద్ద మార్కెట్ లేదు.
ఇతర దర్శకులతో సినిమాలు తీయకుండా ఉండటమే అతడు చేసిన పెద్ద, ఏకైక తప్పు అని చెప్పవచ్చు.ఇక కంగువ సినిమా కోసం సూర్య చాలానే కసరత్తులు చేస్తున్నాడు ఈ మూవీ సక్సెస్ అయితే అన్ని ఇండస్ట్రీల్లో అతని మార్కెట్ పెరుగుతుంది.