యాదాద్రి భువనగిరి జిల్లా:రైతులకు అండగా నిలబడే బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ), డిప్యూటీ సీఎం,ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ రామన్నపేట మండల మహిళా అధ్యక్షురాలు గాదె శోభరాణి రాష్ట్ర రైతాంగం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.గురువారం ఆమె మండల కేంద్రంలో మాట్లాడుతూ ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రూ.72 వేల 659 కోట్లు కేటాయించి,రాష్ట్ర బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో దేశానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.గతంలో కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం,రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు పదేళ్ళుగా రైతులను ఏ విధంగా మోసం చేసాయో తెలిసిందేనన్నారు.
రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, గిట్టుబాటు ధర కల్పించకుండా ఢిల్లీ రైతు పోరాటంలో 700 మంది రైతాంగం చనిపోవడానికి కారణమైన బీజేపీకి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతికత లేదన్నారు.పదేళ్లు ప్రభుత్వం నడిపిన కేసీఆర్ ధరణి వంటి వాటితో రైతాంగం హక్కులను కాలరాసిన చరిత్ర మూటగట్టుకుందన్నారు.
లక్ష రుణమాఫీ మాటలకే పరిమితమైన కేసీఆర్, కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కడం వారికే చెల్లిందన్నారు.
ఈ బడ్జెట్ లో ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడమంటే ఇందిరమ్మ రాజ్యంలోనే రైతుకు భరోసా( Rythu Bharosa) అని మరోసారి నిరూపితమైందన్నారు.అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ.72,659 కోట్లు కేటాయించడం పాటు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని,రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీని చేస్తున్నామన్నారు.ఇప్పటికే రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసిన విషయం కళ్ళ ముందు ఉందన్నారు.పంద్రాగస్టు లోపు రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాది చేతల ప్రభుత్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరూపించారన్నారు.అలాగే రైతులకు రైతు భరోసా,ఇంకా రైతు బీమ, పంట నష్ట పరిహారం కూడా ఉంటుందని,అందుకే వ్యవసాయానికి భారీగా నిధులు కేటాయించి చిత్తశుద్ధిని నిలుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,మంత్రి వర్గాన్ని, నకిరేకల్,మునుగోడు ఎమ్మెల్యేలు వేముల వీరేశం,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తెలంగాణ ప్రజలు, రైతాంగం ఆశీర్వదించాలని కోరారు.