చాలామంది తమ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటారు.అయితే అందుకు రాంగోపాల్ వర్మ పూర్తిగా విరుద్ధం.
తను చెప్పే మాట ఏంటంటే అతడి ఫ్లాప్ సినిమాలన్నీ కూడా కావాలనే తీసినవట అలాగే హిట్ సినిమాలు అన్నీ కూడా అనుకోకుండా జరిగినవి అంటాడు రాంగోపాల్ వర్మ.అందుకు ఒక ఉదాహరణ కూడా చెప్తున్నాడు వర్మ.
అదేంటో వర్మ మాటల్లోనే తెలుసుకుందాం.
రాత్రి సినిమాను ప్లాన్ చేస్తున్న సమయంలో వర్మ కజిన్ చిట్టి అనే వ్యక్తి తన దగ్గరికి వచ్చాడట మెహదీపట్నం రోడ్ లో ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నట్టు చెప్పాడట.మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరగా ఉన్న అంత పెద్ద కాలనీ చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా మరో బార్ లేదని అక్కడ పెడితే బిజినెస్ బాగుంటుందని చెప్పాడట.కేవలం 20 లక్షలు పెట్టుబడి పెడితే మొదటి సంవత్సరంలోనే కోటి రూపాయలు సంపాదించవచ్చని కాగితం మీద ఏవో కొన్ని లెక్కలు కూడా చూపించాడట.
దాంతో వర్మ ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించాడట బార్ స్టార్ట్ అయిన తర్వాత కోటి రూపాయల లాభం మాట పక్కన పెడితే బిజినెస్ లేకపోవడంతో ఏడాదికల్లా అతడి కజిన్ బార్ మూసివేయాల్సి వచ్చింది అంట.
బార్ ఎందుకు మూయాల్సి వచ్చింది అని వర్మ అతడి కజిన్ ని అడగగా అది రెసిడెన్షియల్ కాలనీ కాబట్టి అక్కడ ఉండే వాళ్ళు ఎవ్వరూ దగ్గరగా ఉన్న బార్లో తాగడానికి ఇష్టపడడం లేదని అందుకే దూరంగా ఉన్న బార్స్ కి వెళ్తున్నారట.అది ఊహించే అంతకుముందు ఎవరూ కూడా అక్కడ బార్ ఓపెన్ చేయలేదట.కజిన్ చెప్పిన ఆ కారణాలు కరెక్టే అయ్యుండొచ్చు తాను తీసిన రాత్రి సినిమా ఫ్లాప్ అవ్వడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి సినిమా తీసి ముందు అన్ని కరెక్ట్ అని అనిపిస్తాయి కానీ ఫ్లాప్ అయిన తర్వాతే నిజమైన కారణాలు తెలుస్తాయి.
ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ రాత్రి సినిమా ఫ్లాప్ అని తెలుసు.కానీ తన కజిన్ చిట్టి పెట్టిన బార్ ఫ్లాప్ ఎందుకయిందో నాకు మాత్రమే తెలుసు అంటాడు వర్మ.
అందుకే తను తీసిన అన్ని సినిమాలు కూడా తెలిసి మరీ తీసినవే.