పైల్స్(మొలలు లేదా మూలశంఖ లేదా హెమోరాయిడ్స్).ఇటీవల రోజుల్లో ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగి పోతోంది.
ఒకే చోటు ఎక్కువ సమయం పాటు కూర్చోవడం, మద్యపానం, నీటిని తక్కువగా తీసుకోవడం, ఒత్తిడి, మాంసాహారాలు, బయట ఆహారాలు అతిగా తీసుకోవడం ఇలా రకరకాల కారణాల వల్ల పైల్స్ కు గురవుతుంటారు.ఇక ఈ వ్యాధి గ్రస్తులు నవడానికే కాదు కూర్చోవడానికి కూడా ఎంతగానో ఇబ్బంది పడి పోతుంటారు.
అందుకే పైల్స్‌ను నివారించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే పైల్స్ వ్యాధి ఉన్న వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యంగా కొన్ని కొన్ని ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.మరి ఫుడ్స్ ఏంటో.? వాటిని ఎందుకు తినరాదో.? ఇప్పుడు తెలుసుకుందాం.
పైల్స్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారు నూనెలో వేయించిన ఆహారాలను, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను, మసాలా ఆహారాలను అస్సలు తినరాదు.ఎందుకంటే, వీటి వల్ల మలవిసర్జన సమయంలో భరించ లేనంత నొప్పి మరియు ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలాగే పాలు, పెరుగు, ఛీజ్ మరియు ఇతర పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచివే.అయినప్పటికీ పైల్స్ ఉన్న వారు వీటిని ఎంత మితంగా తీసుకుంటే అంత మంచిది.లేదంటే వ్యాధి మరింత తీవ్రంగా మారుతుంది.

పైల్స్ వ్యాధి ఉన్న వారు ఎట్టిపరిస్థితుల్లోనూ కాఫీని తీసుకోరాదు.ఎందు కంటే కాఫీలో ఉండే కెఫిన్ కంటెంట్ రోగులకు మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది.కాఫీ ఒక్కటే కాదు చాక్లెట్స్, ఎనర్సీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఇలా కెఫీన్ ఉండే ఏ ఫుడ్స్‌నూ తీసుకోరాదు.మరియు మద్యం అలవాటును కూడా పూర్తిగా మానుకోవాలి.
అంతే కాకుండా.ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు, పులియబెట్టిన పిండితో తయారు చేసిన ఇడ్లీ దోసెలు, ప్రాసెస్ చేసిన మాంసాలు, రెడ్ మీట్ వంటి ఆహారాలకూ పైల్స్ వ్యాధి గ్రస్తులు దూరంగా ఉండాలి.