సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే.సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి.
సీనియర్ ఎన్టీఆర్ సహనటిలలో భానుమతి కూడా ఒకరనే సంగతి తెలిసిందే.ఈమె సొంత నిర్మాణ సంస్థ భరణీ పిక్చర్స్ కాగా ఈ బ్యానర్ పై తెరకెక్కిన మూడు సినిమాలలో సీనియర్ ఎన్టీఆర్ నటించారు.
అమ్మాయి పెళ్లి, చింతామణి, చండీరాణి సినిమాలలో సీనియర్ ఎన్టీఆర్ నటించారు.
భానుమతి భర్త పేరు రామకృష్ణారావు కాగా ఈయన డైరెక్షన్ లో తెరకెక్కిన చింతామణి సినిమాలోని బిల్వ మంగళుని రోల్ కోసం మొదట ఏఎన్నార్ ను సంప్రదించగా ఏఎన్నార్ తాను ఆ పాత్రలో నటించలేనని చెప్పారు.
ఆ తర్వాత భరణీ బ్యానర్ పై తెరకెక్కే రేంజ్ సినిమా ఆ సినిమా కాదని ఏఎన్నార్ అన్నారు.అయితే అప్పటికే ఆ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి కావడంతో మేకర్స్ వెనుకడుగు వేయకూడదని భావించారు.
భానుమతి చింతామణి పాత్రలో ఎన్టీఆర్ హీరోగా సినిమా తెరకెక్కగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.ప్రేక్షకులు ఈ సినిమా చూసి నిరాశ చెందడంతో సినిమా ఫ్లాప్ గా నిలిచింది.
మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు సెన్సార్ కట్ చేయడంతో సినిమా ఫ్లాప్ అయింది.

ఎన్టీఆర్ కూడా ఆ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపకుండా ఉండి ఉంటే బాగుండేది.సినిమాలోని హాస్య సన్నివేశాలను కూడా సెన్సార్ సభ్యులు తొలగించడంతో సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.ఈ సినిమా ఎక్కువ మొత్తంలో కలెక్షన్లను సాధించడంలో ఫెయిలైంది.సీనియర్ ఎన్టీఆర్ ఖాతాలో ఫ్లాప్ సినిమాగా ఈ సినిమా నిలిచింది.