మామూలుగా సినిమాలు హిట్ అవ్వడం అన్నది అదృష్టం.ఇంకా చెప్పాలంటే చిన్న సినిమాలు పెద్ద హిట్ అయ్యి భారీగా కలెక్షన్స్ లను రాబట్టడం అన్నది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.
సరైన ఫన్ జానర్ సినిమాకు సీక్వెల్ వస్తే ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తారు.ఇదే విషయాన్ని తాజాగా ప్రూవ్ చేస్తోంది మ్యాడ్టు 2 సినిమా( Mad 2 movie ).మ్యాడ్ సినిమా చిన్నగా వచ్చి మంచి వసూళ్లు తెచ్చుకుంది.ఆ వసూళ్లను బేస్ చేసుకుని మ్యాడ్ 2 ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
మ్యాడ్ 2 కు గట్టిగా 20 కోట్లు ఖర్చు అయింది.విడుదల టైమ్ కే 15 కోట్లు టేబుల్ ప్రాఫిట్ చేసుకున్నారు.

నాన్ థియేటర్, థియేటర్ విక్రయాల( Non-theatrical , theatrical sales ) ద్వారా, థియేటర్ హక్కులు విక్రయించకుండా సితార సంస్థ రెగ్యులర్ బయ్యర్ల ద్వారా జస్ట్ విడుదల చేయించారు.ఇప్పుడు సినిమాకు యావరేజ్ రివ్యూలు వచ్చాయి.కానీ సినిమాకు కలెక్షన్లు బాగున్నాయి.రూరల్ లో అంత లేకున్నా, అర్బన్ లో చాలా బాగుంది.దాంతో దాదాపు ఫస్ట్ వీకెండ్ లో 15 కోట్ల మేరకు షేర్ వసూలు చేసింది.అమ్మకాలతో పోల్చుకుంటే మరొక అయిదు కోట్లు రెండు స్టేట్స్ లో వసూలు చేయగలిగితే చాలు.
మండే కూడా అర్బన్ ఏరియాల్లో బాగానే వుందట.

అంటే తొలి నాలుగైదు రోజుల్లో తీసుకున్న అడ్వాన్స్ లు వెనక్కు వస్తే, మిగిలిన రన్ లాభాలకు మరింత నెంబర్ ను యాడ్ చేస్తుందట.అంటే ఎలా లేదన్నా ఈ చిన్న ప్రాజెక్ట్ మీద ఇరవై కోట్ల వరకు లాభాలు రావచ్చు.అయితే ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే వచ్చిన ప్రతి ఒక్కరూ యావరేజ్ సినిమా అని అంటున్నప్పటికీ చూసే ప్రేక్షకులు మాత్రం చూస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం మ్యాడ్ 2 స్క్వేర్( Mad 2 Square ) సినిమాకు లాభాలు బాగానే వస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో టెన్త్ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ ఇవ్వడంతో పిల్లలకు హాలిడేస్ కూడా వచ్చాయి.
ఇప్పుడు ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.







