పాకిస్థానీ స్టార్ హీరోయిన్ మహీరా ఖాన్ దెబ్బకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది.ఎప్పుడో వైరల్ అయిన పాకిస్థానీ జర్నలిస్ట్ చాంద్ నవాబ్ ఈద్ రిపోర్టింగ్ వీడియోను మహీరా ఖాన్ తాజాగా స్పూఫ్ చేసిన తీరు మామూలుగా లేదు.
అచ్చు గుద్దినట్లు దించేసింది.ఈ ఫన్నీ రీక్రియేషన్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారు.“ఇంటర్నెట్‌లో ఇవాళ ఇదే బెస్ట్” అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.సుమారు 15 ఏళ్ల క్రితం, పాకిస్థానీ రిపోర్టర్ చాంద్ నవాబ్ రైల్వే స్టేషన్ నుంచి ఈద్ రిపోర్టింగ్ ఇస్తుంటే తీసిన వీడియో ఒకటి వైరల్ అయింది.
ఆ వీడియోలో, జనాలు అటూ ఇటూ నడుస్తూ అడ్డు రావడంతో పాపం అతను రిపోర్టింగ్ చెప్పడానికి బాగా ఇబ్బంది పడతాడు, ఫ్రస్ట్రేట్ అయిపోతాడు.అతని ఫేస్‌లో పలికిన ఎక్స్‌ప్రెషన్స్, ఆ ఫన్నీ రియాక్షన్స్ జనాలకు బాగా నచ్చేసి, ఆ వీడియో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయింది.
ఈ క్లిప్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిందంటే, సల్మాన్ ఖాన్, కరీనా కపూర్(Salman Khan, Kareena Kapoor) నటించిన బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘భజరంగీ భాయిజాన్’(Bajrangi Bhaijaan) (2015)లో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ సీన్‌ను రీక్రియేట్ చేయడంతో దీని పాపులారిటీ ఆకాశాన్ని అంటింది.అసలు విషయానికొస్తే, ఈద్ 2025 సందర్భంగా, మహీరా ఖాన్ ఈ ఐకానిక్ క్లిప్‌కు అదిరిపోయే ట్రిబ్యూట్ ఇచ్చింది.ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్ పోస్ట్ చేసింది.అందులో చాంద్ నవాబ్ హావభావాలను, డైలాగ్ డెలివరీని ఇమిటేట్ చేస్తూ మహీరా చేసిన యాక్టింగ్ చూస్తే.వావ్ అనాల్సిందే.ఎర్రటి సల్వార్ సూట్‌లో, ఓ రైల్వే స్టేషన్‌లో ఆ నాటి గందరగోళాన్ని మళ్లీ కళ్లకు కట్టింది.
ఒరిజినల్ వీడియోలో లాగానే, మహీరా షూట్ చేస్తుండగా ఒకతను అడ్డొస్తాడు.దాంతో ఆమెకు వచ్చిన కోపం, చిరాకు అచ్చం చాంద్ నవాబ్ ఒరిజినల్ ఫ్రస్ట్రేషన్‌ను గుర్తుకు తెచ్చింది.
ఆ సీన్ అయితే పీక్స్.దానికి మహీరా “ఈద్ వస్తోంది, రైల్వే స్టేషన్‌లో షూటింగ్, ఇక చాంద్ నవాబ్ (Chand Nawab)అవ్వాల్సిందేగా” అని ఓ క్యాప్షన్ కూడా పెట్టింది.
మహీరా పెర్ఫార్మెన్స్‌కు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.ఆమె కామిక్ టైమింగ్‌ను మెచ్చుకుంటున్నారు.ఆ వీడియోను ఓ “మాస్టర్‌పీస్” అంటున్నారు.“15 ఏళ్లయినా.దీని క్రేజ్ తగ్గలేదు,” అని ఒకరు కామెంట్ చేశారు.“ఈ రోజు ఇంటర్నెట్‌లో చూసిన వాటిలో ఇదే బెస్ట్,” అని ఇంకొకరు రాశారు.“ఇలాంటిది ఒకటి మాకు కావాలని ఇప్పుడే తెలిసింది,” అంటూ మరో ఫ్యాన్ కామెంట్ పెట్టారు.
మరికొందరైతే, “ఇక కంటెంట్ క్రియేటర్ల జాబ్స్ మహీరానే ఎగరేసుకుపోతుందేమో” అని సరదాగా జోకులేస్తున్నారు.ఒరిజినల్ హీరో చాంద్ నవాబ్ ఇప్పటికీ మీడియా రంగంలో యాక్టివ్‌గానే ఉన్నాడు.ప్రస్తుతం పాకిస్థాన్‌లోని ప్రముఖ న్యూస్ ఛానల్ ‘ARY న్యూస్’లో పనిచేస్తున్నాడు.
అంతేకాదు, ఏజే (AJ) మరియు హమ్ డ్రామా (Hum Drama) నిర్మించిన కొన్ని టీవీ డ్రామాల్లో కూడా కనిపించాడు.