జిడ్డు సమస్యతో బాధపడుతున్నారా... అలోవెరాలో ఇది కలిపి రాస్తే నిమిషంలో జిడ్డు మాయం అవుతుంది.

Oily Skin Face Packs, Oily Skin, Oil Skin Home Remedies, Home Remedies, Health Tips

ప్రతి మహిళ ముఖం జిడ్డు లేకుండా అందంగా కాంతివంతంగా ఉండాలని కోరుకుంటుంది.ఆలా కోరుకోవడంలో తప్పు ఏమి లేదు.

 Oily Skin Face Packs, Oily Skin, Oil Skin Home Remedies, Home Remedies, Health T-TeluguStop.com

అయితే ముఖం మీద జిడ్డు తొలగించుకోవడానికి పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.కేవలం మంకు ఇంటిలో అందుబాటులో ఉండే మూడు ఇంగ్రిడియన్స్ తో సులభంగా తొలగించుకోవచ్చు.

ఈ ప్యాక్ ని ట్రూచేసుకోవటం కూడా చాలా సులువు.ఈ ప్యాక్ ని వారంలో రెండు సార్లు వేసుకుంటే జిడ్డు తొలగిపోతుంది.

అలోవెరాకలబందలో ప్రోటీయోలైటిక్ ఎంజైములు,ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉండుట వలన ముఖం మీద జిడ్డును చాలా సమర్ధవంతంగా తొలగిస్తుంది.అంతేకాక యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన చర్మం మీద మృత కణాలను తొలగించటంలో సహాయపడుతుంది.

కలబంద మొక్క నుండి తీసిన జెల్ ని వాడవచ్చు.లేదా మార్కెట్ లో లభించే జెల్ ని అయినా వాడవచ్చు.

రోజ్ వాటర్రోజ్ వాటర్ లో అనేక రకాల విటమిన్స్,యాంటీ ఆక్సిడెంట్స్ ,యాంటీ సెప్టిక్ మరియు యాంటీబ్యాక్టిరియా లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి.రోజ్ వాటర్ చర్మంలో జిడ్డును తొలగించి చర్మం కాంతివంతంగా మారటంతో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

ఉప్పుఉప్పును మనం ప్రతి రోజు వంటల్లో వాడుతూ ఉంటాం.ఉప్పు లేనిదే వంటలకు రుచి రాదు.

అలాంటి ఉప్పు ముఖం మీద జిడ్డును తొలగించటానికి సహాయపడుతుంది.ఉప్పు సహజసిద్ధమైన క్లెన్సర్ గా పనిచేస్తుంది .ఉప్పు చర్మంపై పేరుకున్న మురికిని,జిడ్డును తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.ఒక బౌల్ లో ఒక స్పూన్ అలోవెరా, ఒక స్పూన్ రోజ్ వాటర్, పావు స్పూన్ ఉప్పువేసి బాగా కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద జిడ్డు,మృతకణాలు తొలగి కాంతివంతంగా మారుతుంది.

Oily Skin Face Packs, Oily Skin, Oil Skin Home Remedies, Home Remedies, Health Tips - Telugu Tips, Oil Skin, Oily Skin #TeluguStopVideo #Shorts

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube