ఈ భూమి మీద ధర్మం పెరిగినప్పుడు అంత ధర్మాన్ని తిరిగి స్థాపించడం కోసం శ్రీ మహా విష్ణువు( Sri Maha Vishnu ) ఏదో ఒక రూపంలో అవతరిస్తాడని ఇన్నేళ్లుగా మనం చెప్పుకుంటూ వచ్చాము.అయితే పురాణాల ప్రకారం శ్రీ మహా విష్ణువు యొక్క మొత్తం అవతారాలు 24.
వీటిలో మనకు తెలిసింది దశావతారాలు( Dashavatars ) మాత్రమే.ఈ దశావతారాల్లో ఒక అవతారం, ఈ కలియుగంలోనే పుట్టాల్సి ఉంది.
ఇకపోతే ఈ దశవతారాలలో చేర్చబడనీ మిగిలిపోయిన ఆ 14 ప్రసిద్ధ అవతారాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.హైగ్రీవ.( Hayagreeva ) హిందూమతంలో హైగ్రీవ స్వామిని విష్ణు యొక్క మరో అవతారంగా భావిస్తారు.

అంతేకాకుండా వ్యాసుడు ద్వాపర యుగంలో జన్మించినటువంటి అమర ఋషి.ఆయన హిందూ పురాణాలలోని నాలుగు వేదాలను విభజించడం వలన అతనికి వేదవాసుడు అనే పేరు కూడా వచ్చింది.హిందూ శాస్త్రం ప్రకారం మహిదాస ఒక ఋషి.ఈయన ఐతరయ్య అనే ఒక బ్రాహ్మణాన్ని రచించాడు.శ్రీ మహావిష్ణువు యజ్ఞం అని పిలవబడే మరో అవతారాన్ని కూడా తీసుకుంటారు.
యజ్ఞానికి యాగం అనే మరో పేరు కూడా ఉంది.అంతేకాకుండా దేవతలను రక్షించడానికి శ్రీమహావిష్ణువు ధన్వంతరి( Dhanvantari ) అనే అవతారాన్ని కూడా ఎత్తడం జరిగింది.
ఇక దేవతలకు దైవిక అమృతాన్ని అందించడం కోసం విష్ణువు మోహిని( Mohini ) అనే అవతారాన్ని ఎత్తాడు.

మోహిని అనే పేరు మొహా అనే క్రియా రూపం నుంచి వచ్చింది.దత్తాత్రేయ అవతారం విష్ణువు యొక్క మరొక అవతారం.హిందూమతంలో బ్రహ్మ మానస కుమారుల్లో సనత్ కుమార్లు కూడా ఒకరు.
దైవిక జ్ఞానాన్ని వ్యాపించడానికి విష్ణువు రిషబ్ అవతారాన్ని తీసుకున్నాడు.విష్ణు వేదాలను బోధించడానికి హంసపక్ష అవతారాన్ని తీసుకుంటారు.
అలాగే శ్రీమహావిష్ణువు నరా నారాయణలు అనే ఇద్దరు ,కవలల అవతారం ఎత్తుతాడు.శ్రీ మహావిష్ణువు తాపస అనే అవతారాన్ని కూడా ఎత్తాడు.
శ్రీ మహావిష్ణు ఆది పురుషుడు అనే అవతారం కూడా ఎత్తాడు.