ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పురాతనమైన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.ఇలాంటి పుణ్యక్షేత్రాలకు ప్రతి రోజు భక్తులు వెళ్లి దేవదేవతల దర్శనాలు చేసుకుని పూజలు చేసి వస్తూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే మామూలుగా ప్రజలు తమ కోరికలు, బాధలను తీర్చమని దేవుని ప్రార్థించడానికి దేవాలయాలకు వెళుతూ ఉంటారు.తమ మొక్కులు తీర్చుకునేందుకు దేవాలయంలోని దేవుళ్ళను దర్శించుకుంటూ ఉంటారు.
ప్రజలకు ఎన్ని బాధలు ఉన్నా ఒక్కసారి దేవాలయానికి వెళ్లి దేవుని దర్శించుకుంటే ఆ బాధలన్నీ దూరమైపోయిన అనుభూతి కలుగుతుంది.కానీ ఈ దేవాలయానికి వెళ్తే మాత్రం మానసిక ప్రశాంతత కలగడం ఏమో కానీ ప్రాణాలతో కూడా బయటపడడం కష్టమే.
ఈ దేవాలయంలోకి వెళ్తే మరణం తప్పదని తెలిసి తెలిసి ఎవరు కూడా దేవాలయంలోకి అడుగుపెట్టే సాహసం చేయరు.మరి అంతలా ఈ దేవాలయంలో ఏముంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంతో భయంకరమైనటువంటి ఈ దేవాలయం దక్షిణ టర్కీలోని పాము కలే సమీపంలో ఉంది.ఆలయంలో పక్షులు, జంతువులు చనిపోవడంతో ఈ విషయం బయటికి వచ్చింది.
స్థానికులు ఈ దేవాలయాన్ని నరక ద్వారం గా చెబుతూ ఉంటారు.అయితే ఈ దేవాలయంలోకి వెళ్లిన జంతువులు ఎందుకు మరణిస్తున్నాయి అనే దానిపై పరిశోధనలు చేశారు.
అయితే ఈ దేవాలయంలోకి వెళ్ళినవారు బయటకు రాకుండా లోపల మరణించడానికి గల కారణం ఇక్కడ ఉన్నటువంటి వాయువులే కారణమని తెలిసింది.
ఈ దేవాలయం దిగువ భాగం నుంచి ప్రమాదకరమైన కార్బన్డయాక్సైడ్ వాయువు వస్తుందని పరిశోధకులు తెలుసుకున్నారు.దీనివల్ల దేవాలయంలోకి వెళ్ళిన జంతువులు, పక్షులు మరణిస్తున్నాయని చెబుతున్నారు.సాధారణంగా 10% కార్బన్డయాక్సైడ్ ఉంటేనే 30 నిమిషాల్లో ఎవరైనా మత్తు లోకి జరుపుకుంటారని ఆ తర్వాత మరణిస్తానని చెబుతున్నారు.
అయితే ఈ దేవాలయంలో ఈ విషయమైన వాయువు 91 శాతం వరకు ఉందని చెబుతున్నారు.ఇలా అధిక మోతాదులో కార్బన్డయాక్సైడ్ ఉండటం వల్ల లోపలికి వెళ్ళిన వారికి ఆక్సిజన్ అందక మరణిస్తున్నారని పరిశోధకులు వెల్లడించారు.
దీనివల్ల ఈ దేవాలయంలోకి అడుగు పెట్టాలంటే ఎవరు కూడా సహాసం చేయలేకపోతున్నారని చెప్పారు.
DEVOTIONAL