డిసెంబర్ 27న ఆళ్వార్ తిరుమంజనం.. ఆరోజు ఏమి చేస్తారంటే..

Alwar Thirumanjanam On December 27.. What Will Be Done On That Day , Alwar Thirumanjanam , Vaikuntha Ekadashi, Devotional , Andhra Pradesh , Tirumala Tirupati , Ttd

మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు చిన్న పండుగ దగ్గర నుంచి పెద్ద పండుగ వరకు కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంతో సంతోషంగా ఘనంగా జరుపుకుంటారు.అలాంటి పండుగలలో ఒకటైన వైకుంఠ ఏకాదశి కూడా ఎంతో వైభవంగా ప్రజలందరూ సంతోషంగా చేసుకుంటారు.

 Alwar Thirumanjanam On December 27.. What Will Be Done On That Day , Alwar Thir-TeluguStop.com

జనవరి రెండవ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనాన్ని పురస్కరించుకొని ఆళ్వార్ తిరుమంజనం సేవ జరిగే అవకాశం ఉంది.సాధారణంగా చెప్పాలంటే సంక్రాంతి, దీపావళి ఆస్థానం బ్రహ్మోత్సవాల సమయంలో ఆళ్వార్ తిరుమంజానా జరుగుతూ ఉంటుంది.

అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని 27వ తేదీన దేవాలయాన్ని శుద్ధిచేసే కార్యక్రమం జరుగుతుంది.అంతే కాకుండా ఆరోజు ఉదయం ఆరు గంటల నుంచి 10 వరకు మూల విరాట్ కు పట్టు వస్త్రాలతో కప్పి ఉంచుతారు.

గర్భగుడి, ఆనంద నిలయం, ధ్వజస్తంభం, యోగ నరసింహస్వామి, వకుల మాత వంటి పుణ్యక్షేత్రాలు సంపంగి మండపం, రంగనాథ మండపంతో పాటు దేవాలయాన్ని ఎంతో పవిత్రంగా శుద్ధి చేస్తారు.ఆ తర్వాత పచ్చ కర్పూరం పసుపు వంటి వివిధ మూల పదార్థాలతో తయారు చేసిన మిశ్రమాన్ని దేవాలయం అంతా చల్లి పవిత్ర ంగా శుద్ధి చేస్తారు.

ఇంకా చెప్పాలంటే దేవాలయంలో ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా దర్శనానికి భక్తుల ప్రవేశాన్ని ఆరోజు కాస్త సమయం నిలిపివేస్తారు.ఆ రోజు ఉదయం 11 గంటల తర్వాత యధావిధిగా భక్తులను దర్శనానికి అనుమతిస్తామని దేవస్థానం అధికారులు వెల్లడించారు.దీనివల్ల 5 గంటల పాటు దర్శనం నిలిచిపోయే అవకాశం ఉంది.ఈ విషయాన్ని భక్తులు దృష్టిలో ఉంచుకోవాలని ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు తెలియజేశారు.అయితే గురువారం రోజు శ్రీవారిని దాదాపు 63,000 మంది దర్శించుకున్నారు.22,000 మంది భక్తులు తల నీలాలను సమర్పించినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube