డిసెంబర్ 27న ఆళ్వార్ తిరుమంజనం.. ఆరోజు ఏమి చేస్తారంటే..

డిసెంబర్ 27న ఆళ్వార్ తిరుమంజనం ఆరోజు ఏమి చేస్తారంటే

మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు చిన్న పండుగ దగ్గర నుంచి పెద్ద పండుగ వరకు కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంతో సంతోషంగా ఘనంగా జరుపుకుంటారు.

డిసెంబర్ 27న ఆళ్వార్ తిరుమంజనం ఆరోజు ఏమి చేస్తారంటే

అలాంటి పండుగలలో ఒకటైన వైకుంఠ ఏకాదశి కూడా ఎంతో వైభవంగా ప్రజలందరూ సంతోషంగా చేసుకుంటారు.

డిసెంబర్ 27న ఆళ్వార్ తిరుమంజనం ఆరోజు ఏమి చేస్తారంటే

జనవరి రెండవ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనాన్ని పురస్కరించుకొని ఆళ్వార్ తిరుమంజనం సేవ జరిగే అవకాశం ఉంది.

సాధారణంగా చెప్పాలంటే సంక్రాంతి, దీపావళి ఆస్థానం బ్రహ్మోత్సవాల సమయంలో ఆళ్వార్ తిరుమంజానా జరుగుతూ ఉంటుంది.

అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని 27వ తేదీన దేవాలయాన్ని శుద్ధిచేసే కార్యక్రమం జరుగుతుంది.

అంతే కాకుండా ఆరోజు ఉదయం ఆరు గంటల నుంచి 10 వరకు మూల విరాట్ కు పట్టు వస్త్రాలతో కప్పి ఉంచుతారు.

గర్భగుడి, ఆనంద నిలయం, ధ్వజస్తంభం, యోగ నరసింహస్వామి, వకుల మాత వంటి పుణ్యక్షేత్రాలు సంపంగి మండపం, రంగనాథ మండపంతో పాటు దేవాలయాన్ని ఎంతో పవిత్రంగా శుద్ధి చేస్తారు.

ఆ తర్వాత పచ్చ కర్పూరం పసుపు వంటి వివిధ మూల పదార్థాలతో తయారు చేసిన మిశ్రమాన్ని దేవాలయం అంతా చల్లి పవిత్ర ంగా శుద్ధి చేస్తారు.

"""/"/ ఇంకా చెప్పాలంటే దేవాలయంలో ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా దర్శనానికి భక్తుల ప్రవేశాన్ని ఆరోజు కాస్త సమయం నిలిపివేస్తారు.

ఆ రోజు ఉదయం 11 గంటల తర్వాత యధావిధిగా భక్తులను దర్శనానికి అనుమతిస్తామని దేవస్థానం అధికారులు వెల్లడించారు.

దీనివల్ల 5 గంటల పాటు దర్శనం నిలిచిపోయే అవకాశం ఉంది.ఈ విషయాన్ని భక్తులు దృష్టిలో ఉంచుకోవాలని ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు తెలియజేశారు.

అయితే గురువారం రోజు శ్రీవారిని దాదాపు 63,000 మంది దర్శించుకున్నారు.22,000 మంది భక్తులు తల నీలాలను సమర్పించినట్లు సమాచారం.

స్టాండ్స్ లో చిన్నపిల్లలా ఏడ్చేసిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!