మార్చి 3 నుంచి 7 వరకు శ్రీవారి సాలకట్ల తిప్పోత్సవాలు.. ఆ సేవలు రద్దు..

From March 3 To 7 Srivari Salakatla Tippotsavam.. Those Services Are Cancelled, Rukmini , Lord Krishna , Salakatla Tippotsavam , Tirumala, Devotional, Lord Ram

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది.పండుగలు, పర్వదినాల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని దేవాలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.

 From March 3 To 7 Srivari Salakatla Tippotsavam.. Those Services Are Cancelled,-TeluguStop.com

ఈ సందర్భాలలో వివిధ రకాల సేవలను రద్దు చేస్తున్నట్లు తిరుమల దేవస్థానం వెల్లడించింది.

మార్చి 3వ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తిప్పోత్సవాలు జరగనున్నాయి.

రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.తెప్పోత్సవాల్లో భాగంగా మొదటి రోజు మార్చి మూడున శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారి పుష్కరిణిలో మూడుసార్లు విహరించి భక్తులకు కనువిందు చేస్తారు.

Telugu Bakti, Devotional, Lord Krishna, Lord Ram, Rukmini, Tirumala-Latest News

రెండవ రోజు మార్చి 4న రుక్మిణి సమేత శ్రీ శ్రీకృష్ణుడి అవతారంలో మూడుసార్లు పుష్కరిణిలో తిరుగుతారు.ఇక మూడవరోజు మార్చి ఐదున శ్రీ భూ సమేత మల్లయప్ప స్వామి మూడుసార్లు పుష్కరిణిలో విహరించి భక్తుల కు అనుగ్రహిస్తారు.ఇదే విధంగా శ్రీ మల్లయ్య స్వామి వారు నాలుగవ రోజు మార్చి ఆరవ తేదీన ఐదు సార్లు, చివరి రోజు మార్చి 7వ తేదీన ఏడుసార్లు తెప్ప పై పుష్కరిణిలో విహరించి భక్తులకు కనువిందు చేస్తారు.అయితే ఈ తెప్పోత్సవాల కారణంగా పలు సేవలను రద్దు చేశారు.

మార్చి 3,4 తేదీల్లో తోమాల, శివ అర్చన, సహస్ర దీపాలంకరణ సేవ మార్చి 5, 6 తేదీల్లో తోమాల సేవ, అర్చన అర్చన, అర్జిత బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు.సహస్ర దీపాలంకరణ సేవా మార్చి 7న అర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube