ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైల పుణ్య క్షేత్రనికి ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి భగవంతుని దర్శనం చేసుకుంటూ ఉంటారు.శ్రీశైలంలో జరగనున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవ రోజులలో దేవాలయ దర్శన విధానాలలో చాలా మార్పులు చేసినట్లు ఈవో లావన్న తెలిపారు.
ఈ నెల 13వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి.ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 వరకు జ్యోతిర్ముడి కలిగిన శివ స్వాములకు నిర్ణీత సమయాల్లో మాత్రమే సర్వదర్శనాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
అంతే కాకుండా మధ్యాహ్నం సమయంలో జరుగుతున్న ఉచిత దర్శనాలు సైతం బ్రహ్మోత్సవాల ముందు రోజు వరకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు దేవాలయం అధికారులు వెల్లడించారు.అదే విధంగా శివదీక్ష స్వాములకు చంద్రావతీ కల్యాణ మండపంలో శివదీక్ష శిబిరాల వద్ద నిత్య అన్నదానం తో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు దేవాలయ అధికారులు తెలియజేశారు.

ఇంకా చెప్పాలంటే మండల దీక్షలు చేసుకొని స్వామి అమ్మవార్ల దర్శనాలు పూర్తి చేసుకున్న తర్వాత జ్యోతిర్ముడి సమర్పణ కోసం శివదీక్ష శిబిరాల వద్ద అర్చక పండితుల శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేసేందుకు వీలుగా వసతులను ఏర్పాటు చేసినట్లు దేవాలయ అధికారులు స్పష్టం చేశారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే శివ స్వాములతో పాటు యాత్రికులు కూడా దర్శన సమయాలను పాటిస్తూ క్యూ లైన్ ల వద్ద దేవాలయా సిబ్బందితో సహకరించాలని ఈవో లవన్న భక్తులకు విజ్ఞప్తి చేశారు.అంతే కాకుండా ఈ సంవత్సరం భక్తుల రద్దీ భారీగా ఉండే అవకాశం ఉందని ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి అంచనా వేశారు.ఇంకా చెబుతూ ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులకు యాత్రికులకు ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని దేవాలయ అధికారులకు ఆదేశించారు.