మన భారత దేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.ఈ పుణ్యక్షేత్రాలకు ప్రతి రోజు ఎన్నో వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి భగవంతున్నీ దర్శించుకుంటూ ఉంటారు.
అంతే కాకుండా భక్తులు భారీగా తరలి వచ్చి పూజలు,అభిషేకాలు చేసి మొక్కలు చెల్లించుకుంటూ ఉంటారు.మన దేశంలో పురాతన దేవాలయాలకు కొన్ని వేల ఎకరాల భూమి కూడా ఉంది.
ఈ భూమి దేవాదాయ శాఖ అధికారులు అధికారుల ఆధ్వర్యంలో ఉంటుంది.అలాగే మన రాష్ట్రంలో ఉన్న కొన్ని దేవాలయాలకు వేల ఎకరాల భూములు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తర్వాత రెండో ధనిక దేవాలయంగా శ్రీశైల పుణ్య క్షేత్రం స్థానం సంపాదించింది.శ్రీశైలం దేవాలయానికి నల్లమల్ల రిజర్వ్ ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 4 వేల ఐదు వందల ఎకరాల భూమిని బదలాయించేందుకు అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
దేవాలయానికి సమీపంలో ఉన్న ఈ భూమి కోసం గత ఐదు దశాబ్దాలుగా దేవాలయ, అటవీ శాఖలు పోరాడుతూనే ఉన్నాయి.ముఖ్యంగా చెప్పాలంటే ఈ క్రమంలో ఆ భూమి తమదే అని రుజువు చేసేందుకు దేవాదాయ శాఖ చరిత్రకా రికార్డులతో పక్కాగా నిరూపించడంతో 4,500 ఎకరాల భూమి దేవస్థానం పేరు మీదకి బదిలీ అవుతుంది.
ఇంకా చెప్పాలంటే 4,500 ఎకరాల భూమిని దేవాలయ నిర్వహణ లోకి తీసుకురావడం సంతోషంగా ఉందని దేవాలయ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల పుణ్యక్షేత్రం తర్వాత రెండో ధనిక దేవాలయంగా శ్రీశైల దేవాలయం రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.