బ్రహ్మ ముహూర్తము( Brahma Muhurta ) దేవతల సంచార సమయము అని పండితులు చెబుతున్నారు.తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి 5:30 సమయాన్ని బ్రహ్మ కాలం లేదా బ్రహ్మ ముహూర్తం అని కూడా అంటారు.మత గ్రంథాల ప్రకారం బ్రహ్మ అంటే దేవుడు.ముహూర్తం అంటే సమయం అని అర్థం వస్తుంది.అంటే ప్రతిరోజు ఒకే సమయానికి నిద్ర లేవడాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు.బ్రహ్మ ముహూర్తంలో మీరు కొన్ని పనులు చేయడం వల్ల అది మన అదృష్టం లో భాగమవుతుంది.
బ్రహ్మ ముహూర్తంలో ఈ రెండు పనులు చేయడం శుభప్రదం అని పండితులు చెబుతున్నారు.

ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ( Lakshmi Devi )అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది.ఇంకా చెప్పాలంటే మీరు సూర్యోదయానికి ముందు లేదా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి రోజు వారి పని నుంచి విరమించుకున్న తర్వాత ఆ ముహూర్తంలో చేసే ప్రార్థనలు కచ్చితంగా విజయాన్ని చేకూరుస్తాయని నమ్ముతారు.అంతేకాకుండా బ్రహ్మ ముహూర్త సమయంలో విచే చల్లని స్వచ్ఛమైన, పవిత్రమైన గాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఇది సంపద, ఆర్థిక అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది.హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలు, ధ్యానం( Puja ), ప్రార్ధనలు తప్పకుండా విజయవంతం అవుతాయి.

బ్రహ్మ ముహూర్త సమయంలో పరిసరాలు పవిత్రంగా, ప్రశాంతంగా ఉంటాయని ఈ సమయంలో దేవతలు తీర్థయాత్రలు చేస్తారని చాలామంది ప్రజలు నమ్ముతారు.అలాంటప్పుడు మనం భగవంతుని మంత్రాలను జపిస్తే ఆయన మనకెంతో సంతోషాన్ని ఇస్తాడు.ఇంకా చెప్పాలంటే ఈ సమయంలో స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి కొన్ని మంత్రాలను జపించడం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది.అంతేకాకుండా ఉదయం ముందుగా మన అరచేతులను చూసుకుంటే మనకు సకల దేవతలు దర్శనమిస్తారు.
గ్రహ సంబంధమైన ఆటంకాలను దూరం చేసుకోవాలంటే ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.బ్రహ్మ మురారి త్రిపురాంతకరీ భానుః శశి భూమి సుతో బుధశ్చ|.
ఈ రెండు పనులు చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.