హిందూ ధర్మంలో పూజా కార్యక్రమానికి ఎంతో విశిష్టత ఉంది అని దాదాపు చాలామందికి తెలుసు.పండుగలు పర్వదినాలలో మాత్రమే కాకుండా శుభకార్యాలను కూడా దీపాన్ని వెలిగించి మాత్రమే మొదలుపెడతారు.
అందుకే దీపాన్ని జ్యోతిగా, పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు.అంతే కాకుండా చీకటి నుంచి వెలుగులోకి దారి చూపే దీపానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది.
అయితే చాలా మంది దీపావళి( Diwali ) నుంచి దీపాలు వెలిగించడం మొదలుపెట్టి కార్తీక మాసంలో మాత్రమే దీపాలను వెలిగిస్తారు.అయితే దీపాన్ని సంవత్సరంలో ఒక్క నెలలో మాత్రమే కాకుండా ప్రతి రోజు వెలిగించవచ్చు.
అయితే ఏ కారణంతో దీపం వెలిగించాలి? దీని ప్రాముఖ్యత ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.దీపం అంటే శాంతి, శ్రేయస్సు, సంపదకు అర్థమని పండితులు చెబుతున్నారు.
కాబట్టి ప్రతి రోజు దీపం వెలిగించడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు లభిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.భారతీయ హిందూ సంస్కృతిలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.దీపం వెలిగించడం వల్ల సానుకూల ఆలోచనలు పెరుగుతాయి.అలాగే ప్రతి శుభ కార్యాన్ని దీపం వెలిగించి మొదలుపెడతారు.అయితే ఎంతటి పేరు ప్రాముఖ్యతలు ఉన్నవారు అయినా సరే దీపం వెలిగించే సమయంలో పాదరక్షకాలను తొలగించాలి.అలాగే ఇంట్లో దీపం వెలిగించడం వల్ల మనస్సుకు శాంతి, ఇంట్లో ప్రశాంతత సానుకూల వాతావరణం పెరుగుతుందని శాస్త్రాలలో ఉంది.
అయితే ప్రస్తుత రోజులలో ఇంట్లో రోజు దీపారాధన చేసే వారి సంఖ్య తగ్గిపోతూ ఉంది.
మన పెద్దవారు మట్టి దీపాలను( Matti Deepalu ) ఉపయోగించేవారు.ఇప్పుడు మార్కెట్లో వివిధ రంగులలో దీపాలు లభిస్తున్నాయి.కృతిమ లైట్లు అందుబాటులో ఉన్నాయి.
అయితే వాస్తవానికి ఇటువంటి దీపాలను వెలిగించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని పండితులు చెబుతున్నారు.ఇంట్లో వెలిగించే దీపం వల్ల కాంతి, అందం, మానసిక ప్రశాంతత కలిగేలా ఉండాలి.
కాబట్టి రోజు దీపాన్ని నువ్వుల నూనె, ఆవు నెయ్యి( Sesame oil ) వంటి వాటితో మాత్రమే వెలిగించాలి.అందులోనూ దేవుడి గదిలో ఇలా దీపం వెలిగించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ప్రతి రోజు కనీసం రెండు వత్తులతో నెయ్యి, నూనెతో దీపం వెలిగించి భగవంతునికి సమర్పించడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL