పూర్వం తలస్నానం( Headbath ) చేయడానికి కుంకుడుకాయలను వాడేవాళ్లు.అయితే మారుతున్న కాలంతో పాటు జీవనశైలి కూడా పూర్తిగా మారిపోయింది.
సౌకర్యంగా ఉన్నందున కుంకుడుకాయల స్థానంలోకి ఇప్పుడు షాంపూలు వచ్చాయి.కానీ కుంకుడు కాయలకు మాత్రం మంచి ప్రత్యేకత ఉంది.
అయితే ఆ ప్రత్యేకత ఏంటో తెలిస్తే తిరిగి వాటిని వాడటం ఖాయం.ఈ మధ్యకాలంలో చాలా మంది ఎక్కువగా రకరకాల షాంపులను వాడుతున్నారు.
ఎంత మంచి షాంపులు, ఎంత కాస్ట్లీ షాంపులు వాడినప్పటికీ కూడా జుట్టు మాత్రం రాలుతూనే ఉంటుంది.

ఇక జుట్టు సమస్యలపై( Hair Problems ) చాలామంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతుంటారు.వెంట్రుకలు రాలిపోవడం, వెంట్రుకలు తెల్లబడడం, చుండ్రు( Dandruff ) లాంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు.అయితే దీనికి కారణం కెమికల్స్ అని చెప్పవచ్చు.
షాంపూలలో ఎక్కువగా కెమికల్స్ ను వాడతారు.కాబట్టి షాంపూలను వాడుతున్నప్పటి నుంచి ఇలాంటి సమస్యలు ఎక్కువగా అయ్యాయి.
పూర్వం కేవలం కుంకుడుకాయలతో మాత్రమే తలస్నానం చేసేవాళ్లు అది మన జుట్టుకి చాలా మంచిది.
కుంకుడుకాయ( Soapberries )లో యాంటీ మైక్రోబియల్, ఆంటీ ఫంగల్ గుణాల వల్ల చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది.
ఎందుకంటే ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు.అంతేకాకుండా వాడటం వలన జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఎదుగుతుంది.
అయితే కుంకుడు రసంలో కాస్త మెంతిపిండి( Methiflour ) కూడా కలుపుకొని నానబెట్టి తలస్నానం చేయాలి.ఇలా చేస్తే కురులు పట్టుకుచ్చులా మారుతాయి.
ఇక చుండ్రులను చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు.అయితే దీనికి చక్కటి ఔషధం కుంకుడుకాయలు మాత్రమే.
ఈ రసంలో మందార ఆకులను నూరి కలిపి రుద్దుకోవాలి.

ఇలా రెండు మూడు రోజులకు ఒకసారైనా చేస్తే చుండ్రు సమస్య ఆధ్వర్యంలో మారి రాలిన జుట్టు కూడా తిరిగి వస్తుంది.లక్షణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.అందుకే దీన్ని చర్మానికి క్లెన్సర్ గాను కూడా వాడుతూ ఉంటారు.
ఫలితంగా మొటిమలు వాటి తాలూకు మచ్చలు కూడా దూరం అవుతాయి.అందుకే కుంకుడు రసంలో ముంచిన దూదితో ముఖాన్ని శుభ్రం చేస్తే చర్మానికి కూడా చాలా మంచిది.
క్రమంగా రోజు ఇలా చేస్తే చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయి.