ఇపుడు స్మార్ట్ ఫోన్ లేనివారిని చూడడం కష్టం.కాదు కాదు.
అసాధ్యం అని చెప్పుకోవచ్చు.దాంతో సాధారణంగానే సోషల్ మీడియా( Social Media ) హవా అనేది బాగా పెరిగిపోయింది.
మరీ ముఖ్యంగా భారత దేశంలో సగటు పదిమందిలో 9 మంది సోషల్ మీడియాలోనే ఎక్కువగా కాపురం చేస్తునట్టు సర్వేలు చెబుతున్నాయంటే మీరు అర్ధం చేసుకోవచ్చు.ఇంకా చెప్పాలంటే భారతీయులనే ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఎక్కువ కంపెనీలు యాప్ డెవలప్మెంట్స్ అనేవి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు.

ఈ క్రమంలో ఇక్కడ ఎక్కువగా అనేక వీడియోలు వైరల్( Viral Videos ) అవుతుండడం మనం చూడవచ్చు.ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో ఆహుతులను బాగా ఆకట్టుకుంటోంది.మీరు బాలా దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘అవన్ ఇవన్’( Avan Evan Movie ) అంటే తెలుగులో వాడు వీడు పేరుతో రిలీజైన సినిమాను చూసే వుంటారు.అందులో యువన్ శంకర్ రాజా స్వరపరిచిన ఆఫ్‌బీట్ సాంగ్ ‘హే…డియో డియో డోలే’ పాటని చూసే వుంటారు.
ఆ పాటకు తిరుచిరాపల్లి(తమిళనాడు) కేంబ్రిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో( Cambridge Internatioal School ) జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కొంతమంది యువతులు డాన్సు ఇరగదీసారు.

అవును, ఈ కార్యక్రమాలలో కెల్లా హైలెట్‌గా నిలిచింది ఆ ముగ్గురు పిల్లల డ్యాన్స్.జడలో మల్లెలు తురుముకొని, సంప్రదాయ చీరెలు ధరించి ‘హే…డియో డియో డోలే’ పాటకు ముగ్గురు పిల్లలు చేసిన డ్యాన్స్ కు అక్కడ జనాలేకాకుండా సోషల్ మీడియా జనాలు కూడా ఊగిపోతున్నారు.దాంతో చాలామంది ‘ఈ బాలికలు నృత్యం ఎంత చక్కగా చేశారో’ అని ఆ వీడియోను చూసి ప్రశంసించిన కామెంట్స్ మనం చూడవచ్చు.
అయితే అసలు విషయం తెలిస్తే మీరు ముక్కన వెలుసుకుంటారు… నిజానికి వారు బాలికలు కాదు బాలురట!







