మలవిసర్జన కష్టతరంగా ఉండటం లేదా తక్కువ సార్లు జరగడమే మలబద్ధకం(constipation).పిల్లలు, పెద్దలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు.ఇలా అందరిలోనూ ఈ సమస్య తలెత్తవచ్చు.ఫైబర్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగకపోవడం, అధిక ప్రాసెస్ చేసిన ఆహారం, చాక్లెట్లు, లేదా ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం, శరీరానికి శ్రమ లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, మలవిసర్జనకు నిర్లక్ష్యం చేయడం, కడుపులో అల్సర్లు, పలు మందుల వాడకం, ఒత్తిడి, వృద్ధాప్యం, గ్యాస్ లేదా అజీర్తి సమస్యలు తదితర కారణాల వల్ల మలబద్ధకం ఇబ్బంది పెడుతుంటుంది.
అయితే ఎటువంటి మందులతో అవసరం లేకుండా ఈ సమస్యను సులభంగా వదిలించుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలు చాలా ఉత్తమంగా సహాయపడతాయి.అవేంటో ఓ చూపు చూసేయండి మరి.
క్యాస్టర్ ఆయిల్(Castor oil).
అదేనండి ఆముదం మలబద్ధకం నివారణలో అద్భుతంగా తోడ్పడుతుంది.ఆముదంలో రిసినోలిక్ యాసిడ్ ఉంటుంది, ఇది ప్రేగుల కదలికలను ఉద్దీపన చేస్తుంది.
దాంతో విసర్జన సులభంగా జరుగుతుంది.అందుకోసం నైట్ నిద్రించే ముందు ఒక స్పూన్ ఆముదాన్ని (Castor oil)నేరుగా తీసుకోవాలి.
లేదా ఆముదాన్ని గోరువెచ్చని నీటిలో కానీ, పాలల్లో కానీ కలిపి తీసుకున్నా ప్రభావవంతంగా పని చేస్తుంది.

పుదీనా మరియు అల్లం టీతో(mint and ginger tea) మలబద్ధకం సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు.అందుకోసం ఒక గ్లాస్ వాటర్ లో ఐదారు ఫ్రెష్ పుదీనా ఆకులు, వన్ టీ స్పూన్ అల్లం తురుము వేసి మరిగిస్తే టీ రెడీ అవుతుంది.ఈ పుదీనా అల్లం టీను ఫిల్టర్ చేసుకుని రోజూ ఉదయం తాగారంటే కడుపు ఫ్రీ అవుతుంది.
మలబద్ధకం మటాష్ అవుతుంది.

ప్రతి రోజూ ఒక గ్లాస్ మజ్జిగలో హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకుంటే మలబద్ధకం దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.అలాగే తరచూ మలబద్ధకంతో బాధపడేవారు పచ్చి కూరగాయలు, పండ్లు, పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.రోజుకు కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసులు నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.
నిద్యం అరగంట పాటు వ్యాయామం చేయండి.తద్వారా జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది.
పేగుల్లోని అవశేష పదార్థాలను తేలికగా బయటకు పోతాయి.