ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలంటే నిద్ర తప్పనిసరి.నిద్ర అలసిన శరీరానికి ఉపశమనం ఇస్తుంది.
మైండ్‌ను రీఫ్రెష్ చేస్తుంది.మానసిక సమస్యలను దూరం చేస్తుంది.
అందుకే ప్రతి ఒక్కరికీ నిద్ర చాలా అవసరం.అయితే ఎంత అవసరం అంటే ఆరోగ్యానికి మంచి చేసేంత వరకు మాత్రమే.
అలా కాకుండా నిద్రపోవడమే పనిగా పెట్టుకుంటే.అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఎందుకంటే, అతి అనర్థదాయకం.ఇది నిద్ర విషయంలోనూ వర్తిస్తుంది.మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎనిమిది గంటల నిద్ర అవసరం.కానీ, అంతకు మించి నిద్రిస్తే.
బోలెడన్నీ సమస్యలు చుట్టుముడతాయి.ముఖ్యంగా చాలా మంది పగటి పూట నిద్ర రకపోయినా.
కావాలని నిద్రిస్తుంటారు.అయితే ఇలా పగటి పూట నిద్రించేవారు షుగర్ బారిన పడడంతోపాటు అధిక బరువు పెరగానికి కూడా దారితీస్తున్నదట.
తిండి తినకుండా ఉండొచ్చు కానీ నిద్ర పోకుండా మాత్రం ఎక్కువ రోజులు ఉండటం అసాధ్యం.అలా అని ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల కొందరికి అధిక తలనొప్పికి దారితీస్తుంది.వాస్తవానికి నిద్రలేమి వల్ల డిప్రెషన్ కు గురి అవుతారన్న విషయం అందరికీ తెలిసిందే.కానీ, అధిక నిద్ర వల్ల కూడా డిప్రెషన్ కు లోనవుతారని కొన్ని పరిశోధనల్లో తేలింది.
ఇక అతిగా నిద్రపోయే వారిలో 49 శాతం మందికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.అలాగే అతిగా నిద్రించడం వల్ల క్యాన్సర్, అర్థరైటిస్ వంటి వ్యాధులు వచ్చే రిస్క్ కూడా ఎక్కువని అంటున్నారు.
అంటే.ఎంత ఎక్కువ సేపు నిద్రపోతే అంత డేంజర్ అన్నమాట.
సో.బేకేర్‌ఫుల్!