నెల క్రితం అదృశ్యం.. స్కాట్లాండ్‌ నదిలో శవమై తేలిన భారతీయ విద్యార్ధిని

ఈ నెల ప్రారంభంలో కనిపించకుండా పోయిన 22 ఏళ్ల భారతీయ విద్యార్ధిని మృతదేహం స్కాట్లాండ్‌లోని ( Scotland )ఓ నదిలో లభ్యమైంది.అధికారికంగా మృతదేహాన్ని గుర్తించేందుకు అధికారులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

 22 Years Old Missing Indian Student’s Body Found In Scotland River , Scotland-TeluguStop.com

మృతురాలిని కేరళకు చెందిన శాంట్రా సాజుగా ( Santra Sajuga )గుర్తించారు.స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్‌లోని హెరియట్ – వాట్ యూనివర్సిటీలో( Heriot – Watt University, Edinburgh ) ఆమె కొద్దిరోజుల క్రితం చేరింది.

శుక్రవారం నగరంలోని న్యూబ్రిడ్జ్ సమీపంలోని నదిలో ఓ గుర్తు తెలియని యువతి మృతదేహం ఉన్నట్లుగా స్థానికులు తమకు అందించారని స్కాట్లాండ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.స్కాట్లాండ్ ప్రాసిక్యూషన్ సర్వీస్ , డెత్ ఇన్వెస్టిగేషన్ బాడీకి నివేదిక పంపబడుతుందని పోలీసులు వెల్లడించారు.

Telugu Indianscotland, Asdasupermarket, Edinburgh, Heriot Watt, Livingston, Indi

సాజు చివరిసారిగా డిసెంబర్ 6 సాయంత్రం లివింగ్‌స్టన్‌లోని ఆల్మండ్‌వేల్‌లోని అస్డా సూపర్ మార్కెట్ స్టోర్‌లోని సీసీటీవీలో కనిపించి తర్వాత జాడ లేకుండా పోయింది.ఆ వెంటనే మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, నల్లటి జుట్టు, లేత గోధుమ రంగు ఇయర్‌మఫ్‌లు, ముఖానికి నలుపు జాకెట్‌ను ధరించినట్లుగా ఉన్న సాజు ఫోటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు.ఏదైనా సమాచారం తెలిస్తే తక్షణం తమను సంప్రదించాల్సిందిగా వారు కోరారు.

Telugu Indianscotland, Asdasupermarket, Edinburgh, Heriot Watt, Livingston, Indi

కార్‌స్టోర్‌ఫిన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ అలిసన్ లారీ ( Inspector Alison Laurie )మాట్లాడుతూ.శుక్రవారం సాయంత్రం బర్న్‌వేల్‌లోని ఓ ఏరియాలో శాంట్రా ఓ బ్యాగ్‌తో కనిపించినట్లుగా వెల్లడించారు.ఆ బ్యాగ్ విచిత్రంగా ఉందని.

సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలిపారు.చివరిసారిగా సాజు కనిపించిన సూపర్‌ మార్కెట్‌ లోపలికి వెళ్లేటప్పుడు ఆమె వెంట ఈ బ్యాగ్ లేదని పేర్కొన్నారు.

ఎవరైనా ఆమెను గుర్తిస్తారనే ఆశతో సూపర్ మార్కెట్‌లో శాంట్రా ఉన్న ఫోటోలు విడుదల చేశామని శాంట్రా చెప్పారు.శాంట్రా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమె అదృశ్యం కావడంతో ఎంతో ఆందోళనకు గురవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube