మ‌గ‌వారు వాల్ న‌ట్స్ తీసుకుంటే..ఆ స‌మ‌స్య‌లు దూరం!

వివాహ‌మైన దంప‌తులంద‌రూ త‌మ వార‌సుల‌ కోసం తహతహలాడుతూ ఉంటారు.అయితే నేటి ఆధునిక కాలంలో ఆడ‌వారితో పాటుగా చాలా మంది మ‌గ‌వారు కూడా సంతాన సాఫల్య స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్నారు.

 Walnuts, Fertility Problems In Man, Fertility Problems, Man, Latest News, Health-TeluguStop.com

ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, ఓత్తిడి, హార్మోన్ల లోపం, అంగస్థంభన సమస్యలు, చెడు అల‌వాట్లు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మగ‌వారు సంతానలేమిని ఎదుర్కొంటున్నారు.అయితే కొన్ని కొన్ని ఆహారాల ద్వారా సంతాన‌ స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు.

అలాంటి ఆహారాల్లో వాల్ న‌ట్స్ ఒక‌టి.

ఆరోగ్య‌క‌ర‌మైన న‌ట్స్‌లో వాల్ న‌ట్స్ ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.

వాల్ న‌ట్స్‌లో కాల్షియం, పొటాషియం, ఐర‌న్‌, సోడియం, ప్రోటీన్స్‌, ఫైబ‌ర్‌, కార్బోహైడ్రేట్స్‌, గుడ్ ఫ్యాట్స్ ఇలా అనేక పోష‌కాలు నిండి ఉంటాయి.అటువంటి వాల్ న‌ట్స్‌ను మ‌గవారు ప్ర‌తి రోజు ఒక గుప్పెడు చ‌ప్పున తీసుకోవాలి.

ఇలా చేస్తే.వాల్ న‌ట్స్‌లో ఉండే పోష‌కాలు మగవారిలో ఏర్పడే అనేక లైంగిక సమస్యలను తొలగిస్తాయి.

Telugu Tips, Latest, Walnuts-Telugu Health - తెలుగు హెల్త

నాణ్యమైన వీర్యకణాల ఉత్పత్తికి సహాయపడ‌తాయి. వీర్యకణాల కదలికలలో వ‌చ్చే తేడాలను నివారించి.వాటి కదిలిక సామ‌ర్థ్యాన్ని పెంచుతాయి.అలాగే శరీరానికి తక్షణ శక్తిని కూడా అందిస్తాయి.అందువ‌ల్ల‌, వాల్ నట్స్‌ను డైలీ డైట్‌లో చేర్చుకుంటే మంచిది.ఒక వేళ డైరెక్ట్‌గా వాల్ న‌ట్స్ తీసుకోలేని వారి.

స్వ‌చ్ఛ‌మైన తేనెలో వాల్ న‌ట్స్‌ను కాసేపు నాన బెట్టి అయినా తీసుకోవ‌చ్చు.ఇలా తీసుకున్నా మంచి ఫ‌లితం ఉంటుంది.

ఇక వాల్ న‌ట్స్ మాత్ర‌మే కాదు. అర‌టి పండు, బీన్స్‌, బ్రోక‌లీ, దానిమ్మ పండు, పాల‌కూర‌, వెల్లుల్లి పాయ, పాలు, ఖ‌ర్జూరాలు, సిట్రస్ ఫ్రూట్స్ వంటి ఆహారాలు కూడా సంతాన స‌మ‌స్య‌లు దూరం చేయాలి.

కాబ‌ట్టి, సంతాన సాఫల్య స‌మ‌స్య‌లతో బాధ ప‌డే వారు ఈ ఆహారాలును డైట్‌లో చేర్చుకుంటే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube