బెల్లం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.స్వీట్స్ తయారీలో బెల్లం( Jaggery ) ను విరివిరిగా వాడుతుంటారు.
చాలా మంది షుగర్ ఆరోగ్యానికి మంచిది కాదని బెల్లాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు.ఆరోగ్యపరంగా బెల్లం అనేక ప్రయోజనాలు అందిస్తుంది.
అయితే అందాన్ని పెంచడానికి కూడా బెల్లం ఉపయోగపడుతుందని మీకు తెలుసా.? ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా బెల్లం ను వాడితే మీ ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు.క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.మరి లేటెందుకు చర్మానికి బెల్లాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక టమాటో( Tomato )ని తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బెల్లం పౌడర్ ( Jaggery powder )ను వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు టమాటో ప్యూరీ, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు ( Organic turmeric )వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత చర్మాన్ని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ విధంగా రోజుకు ఒకసారి కనుక చేస్తే ముఖంపై ఎలాంటి మొండి మచ్చలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.మొటిమలు ఏమైనా ఉంటే ఒకటి రెండు రోజుల్లోనే తగ్గుముఖం పడతాయి.
క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.అలాగే ఈ రెమెడీ మీ చర్మాన్ని కాంతివంతంగా ప్రకాశవంతంగా మారుస్తుంది.
స్కిన్ టోన్ ను పెంచుతుంది.బ్లాక్ హెడ్స్( Black heads ) వైట్ హెడ్స్ ఏమైనా ఉన్నా దూరం అవుతాయి.
కాబట్టి ఎలాంటి మచ్చ మొటిమ లేకుండా అందంగా మెరిసిపోయే చర్మాన్ని కోరుకునేవారు బెల్లంతో పైన చెప్పిన రెమెడీని తప్పకుండా పాటించండి.







