1.చంద్రబాబుపై సజ్జల విమర్శలు

టిడిపి అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన విమర్శలు చేశారు.అక్రమాలకు చిరునామాగా చంద్రబాబు ఉన్న అక్రమ నివాసం కనిపిస్తుందని సజ్జల విమర్శించారు.
2.లోకేష్ పాదయాత్రలో భువనేశ్వరి

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేటికీ 100వ రోజుకు చేరుకుంది.చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి లోకేష్ పాదయాత్రలు పాల్గొన్నారు.
3.వైసిపి ఎమ్మెల్సీ ల ప్రమాణస్వీకారం
స్థానిక సంస్థల కోటలో విజయం సాధించిన వైసిపి ఎమ్మెల్యేలు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు.పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, నార్త్ రామారావు, కుడుపూడి సూర్యనారాయణ , వంకా రవీంద్రనాథ్, కౌరు శ్రీనివాస్, మేరిగ మురళీధర్, అలంపూర్ మధుసూదన్ , సిపాయి సుబ్రహ్మణ్యం లతో మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణస్వీకారం చేయించారు.
4.రానున్న మూడు రోజులు తీవ్ర ఎండలు
తెలంగాణలో రానున్న మూడు రోజులు తీవ్ర ఎండలు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
5.చిట్స్ నిర్వహణ లో కొత్త రూల్స్

చిట్స్ నిర్వహణలో కొత్త విధానాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది .ఇక నుంచి అంతా ఆన్లైన్ విధానంలో లావాదేవీలు నిర్వహించే విధంగా ఈ చిట్స్ అనే ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ను ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు.
6.కాపుల మద్దతు పవన్ కే : బుద్ధ వెంకన్న
కాపులు 100% పవన్ కళ్యాణ్ ఓటేస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు టిడిపి సీనియర్ నేత బుద్ధ వెంకన్న.
7.సిపిఐ నారాయణ కామెంట్స్

తెలంగాణలో కాంగ్రెస్ , బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
8.రాష్ట్రంలో కుట్ర జరుగుతోంది : ధర్మాన
రాష్ట్రంలో కుట్ర జరుగుతుందని, జగన్ ప్రభుత్వం పై కుట్ర చేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు.
9.పవన్ కళ్యాణ్ పై నల్లపురెడ్డి విమర్శలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కోవూరు వైసిపి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శలు చేశారు.పవన్ తన శీలం చంద్రబాబుకు అమ్మేశాడని , నువ్వు ప్యాకేజీ స్టార్ వే అంటూ విమర్శించారు.
10.కల్తీ మద్యం సేవించి 30 మంది మృతి
తమిళనాడులో ని విల్లుపురం, చెంగల్ పట్టు జిల్లాల్లో నకిలీ మద్యం సేవించి ముగ్గురు మహిళలతో సహా పదిమంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
11.కాశ్మీర్ లో ఎన్.ఐ.ఏ దాడులు

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దక్షిణ కాశ్మీర్ లోని పు, షోపియన్ లలో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో దర్యాప్తు చేపట్టింది.ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది.
11.సిబిఐ డైరెక్టర్ గా ప్రవీణ్ సూద్
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నూతన డైరెక్టర్ గా కర్ణాటక డిజిపి ప్రవీణ్ సూద్ ను కేంద్రం నియమించింది.
12.నేటి నుంచి సీఎం కప్ పోటీలు
గ్రామాలకు పరిమితమవుతున్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సీఎం కప్ 2023 క్రీడ పోటీలకు శ్రీకారం చుట్టింది.ఈనెల 31వ తేదీ వరకు మండల జిల్లా రాష్ట్రస్థాయిలో వివిధ క్రీడ అంశాల్లో పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
13.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్

తెలంగాణ ప్రభుత్వం చేసిన అవినీతిని గొంతు విప్పడానికి వనపర్తి జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక కన్నీళ్లు మిగిలాయని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు.
14.రైతులకు మూడు ఎకరాలపై జూపల్లి విమర్శలు
2014 ఎన్నికలకు ముందు డబల్ బెడ్ రూమ్ లు ఇస్తామని ఆరు లక్షల ఇళ్లు 3 లక్షలకు తగ్గించారు.డబల్ బెడ్ రూం ఇళ్లు ఎందుకు కట్టించలేకపోయారు , అలాగే దళితులకు మూడు ఎకరాలు ఇస్తామన్నారు ఎంతమందికి ఇచ్చారు అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
15.బండి సంజయ్ కామెంట్స్

హిందుత్వం లేకుండా భారతదేశం లేదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
16.పుష్ప టు గెటప్ లో వైసీపీ ఎంపీ
వైసీపీ ఎంపీ గురుమూర్తి మాతంగి వేషాధారణలో కనిపించారు.తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఘనంగా జరుగుతుండగా , వివిధ వేషాలు ధరించి గంగమ్మకు మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది.తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా పుష్ప 2 వేషధారణలో గంగమ్మ భక్తి చైతన్య యాత్రలో పాల్గొన్నారు.
17.ఏపీ మంత్రి కామెంట్స్

చరిత్రలో ఎవరూ చేయలేని యజ్ఞాన్ని తమ ప్రభుత్వం చేస్తుందని ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
18.ఈడీ విచారణకు చీకోటి ప్రవీణ్
థాయిలాండ్ గ్యాంబ్లింగ్ కేసులు చీకోటి ప్రవీణ్ ఈడీ విచారణకు తన న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు.
19.ఢిల్లీ బయలుదేరిన సిద్ధరామయ్య

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నేత సిద్ధరామయ్య ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ కీలక నేత సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో భేటీ కానున్నారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 56,650
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 61,800
.