గ్లోబల్ స్టార్ ధనుష్ ( Dhanush ) ప్రజెంట్ ఫుల్ జోష్ లో ఉన్నాడు.వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ కేరీర్ లో దూసుకు పోతున్నాడు.
ఇటీవలే ధనుష్ టాలీవుడ్ డైరెక్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ సినిమా చేయగా సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా మంచి హిట్ అందుకుంది.
అలాగే కలెక్షన్స్ పరంగా 100 కోట్లను దాటేసి సూపర్ హిట్ గా నిలిచింది.మరి ధనుష్ సార్ వంటి సినిమాతో మంచి జోష్ లోకి వెళ్లిపోయారు.ఈ క్రమంలోనే వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మంచి స్వింగ్ లో ఉన్నారు.తాజాగా ధనుష్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

అది కూడా తన మాజీ మామ ప్రజెంట్ నటిస్తున్న డైరెక్టర్ తో ధనుష్ నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.మరి ఆ డైరెక్టర్ ఎవరంటే నెల్సన్ దిలీప్ కుమార్.ఈయన గత సినిమా బీస్ట్.విజయ్ తో చేసిన ఈ సినిమా తర్వాత ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ ( Rajinikanth ) తో జైలర్ ( Jailer) సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది.ఈ క్రమంలోనే ఈయన నెక్స్ట్ సినిమాపై వార్తలు వైరల్ అవుతున్నాయి.నెల్సన్ ( Nelson Dilipkuma r) నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రజినీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ తో చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు అని ఈ ప్రాజెక్ట్ ను తమిళ్ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించడానికి సిద్ధంగా ఉందని.వీరే ధనుష్ తో, నెల్సన్ తో చర్చలు జరుపుతున్నట్టు టాక్.
ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ సినిమా తో బిజీగా ఉన్న ధనుష్ ఈ సినిమాకు ఓకే చేస్తాడో లేదో చూడాలి.







