భారీ బ్యాక్ గ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన మొదటి సినిమా నుంచి కూడా ఎప్పుడూ కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ అంతకంతకూ ఎదిగిన హీరో అల్లు అర్జున్.తక్కువ సమయంలోనే తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోనే టాప్ హీరో గా కొనసాగుతున్నాడు.నటన డాన్సులు ఫైట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అల్లు అర్జున్ కి ఇది తక్కువ అని చెప్పడానికి ఎంత వెతికినా దొరకదు అని చెప్పాలి.
ఇటీవల కాలంలో అయితే అల్లు అర్జున్ బాక్సాఫీస్ కింగ్ గా మారిపోయాడు.
యూత్ లో ఎవరూ ఊహించని విధంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ తన డ్రస్సింగ్ స్టైల్ తో టాలీవుడ్ లో ఎన్నో సార్లు కొత్త ట్రెండ్ సృష్టించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.సాదా సీదా హీరో నుంచి యూత్ ఐకాన్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్.
అల్లురామ లింగయ్య మనవడి గా చిరంజీవి మేనల్లుడు గా ఎంట్రీ ఇచ్చిన ఇప్పుడు మాత్రం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు అయితే గంగోత్రి సినిమా తో బన్నీ ఎంట్రీ ఇచ్చిన సమయంలో చాలా రూమర్లు వచ్చాయ్.అసలు ఇతను హీరోనా ఇక సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి హీరోగా పరిచయమయ్యాడూ.
లేదంటే అసలు హీరోగా పనికి రాడు అంటూ ఎవరిపై రానని విమర్శలు ఎదుర్కొన్నాడు బన్నీ.

వాటన్నింటినీ కూడా ఛాలెంజ్ గా తీసుకున్న బన్ని తనను తాను ఎప్పుడూ కొత్తగా మలుచుకున్నాడు.వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తనలోని నటుడిని ప్రేక్షకులకు నిరూపిస్తూ వచ్చాడు.డాన్సులతో తనకు తిరుగు లేదు అని నిరూపించాడు.
ఇలా బ్లాక్ బస్టర్ హిట్లతో ఎంతోమంది నోర్లు మూయించాడు.ఇక బన్నీ సినిమాతో అల్లు అర్జున్ పేరు కాస్త బన్నీగా మారిపోయింది.
తెలుగు ప్రేక్షకులందరూ అలాగే పిలవడం మొదలుపెట్టారు. సరైనోడు సినిమా తో వంద కోట్లు అలా వైకుంఠపురం సినిమా తో 200 కోట్లు ఇక ఇటీవల పుష్ప సినిమాతో 350 కోట్లు సాధించి అంతకంతకూ తన క్రేజ్ పెంచుకుంటూనే పోతున్నాడు అల్లు అర్జున్.
ఇక ఇప్పుడు పుష్ప 2 అనే సినిమాలో నటిస్తున్నాడు.