సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దే నటిస్తుంది.
హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది.ఇక ఈ సినిమాలో మరో ట్విస్ట్ ఏంటంటే మహేష్ తో పాటుగా వెంకటేష్ కూడా ఉంటాడని లేటెస్ట్ టాక్.
ఆల్రెడీ మహేష్, వెంకటేష్ కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశారు.ఇక ఇప్పుడు త్రివిక్రం డైరక్షన్ లో మహేష్, వెంకటేష్ మల్టీస్టారర్ రాబోతుందని తెలుస్తుంది.
మహేష్ లో ఒక్కడికోసమే కథ రాసుకోగా వెంకటేష్ కూడా ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది.రైటర్ గా త్రివిక్రం వెంకటేష్ సినిమాలు చేయగా డైరక్టర్ అయ్యాక మాత్రం వెంకీతో కలిసి పనిచేయలేదు.
అజ్ఞాతవాసి సినిమాలో ఓ చిన్న కెమియో రోల్ చేశాడు వెంకటేష్.అయితే మహేష్, త్రివిక్రం సినిమాలో వెంకటేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తుంది.
ఈ సినిమాకు వెంకటేష్ కూడా స్పెషల్ హైలెట్ గా నిలుస్తాడని అంటున్నారు.మరి వెంకీ, మహేష్ కాంబో మరోసారి ప్రేక్షకులను ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.