ఎముకలు దృడంగా ఉండాలంటే కచ్చితంగా ఇవి తినాల్సిందే..!

ప్రస్తుతం ప్రపంచంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో పని ఒత్తిడి, అలాగే మానసిక ఒత్తిడి తో పాటు చాలా మంది ఎముకలకు సంబంధించిన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు.దీనికి గల ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారమే.

 Vitamin D, Vegatables, Calcuim, Health Tips, Milk, Fishes, Tablets, Human Bones-TeluguStop.com

నేటి కాలంలో యువత చాలామంది శక్తి లేక డీలా పడుతున్న సంగతి తెలిసిందే.కొందరైతే మరీ ఘోరంగా లిఫ్ట్ కు అలవాటు పడిన వారు కేవలం రెండు అంతస్థుల మెట్లు ఎక్కాలి అంటే ఎంతో ఆయాశ పడిపోతుంటారు.

మరికొందరికి 40 సంవత్సరాలు వచ్చాయంటే చాలు మోకాళ్ళ నొప్పులు మొదలైపోయి కూర్చున్న వారు లేయలేక ఇబ్బందులు పడుతుంటారు.అంతేకాదు మరికొందరు వెన్నునొప్పితో కూడా అనేక ఇబ్బందులు పడుతుంటారు.

అయితే ఇందుకు ప్రధాన కారణం మాత్రం శరీరంలో విటమిన్ డి అలాగే కాల్షియం లోపమే.

మనకు విటమిన్-డి ఉదయం పూట అలాగే సాయంత్రం పూట సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి ని సంపాదించుకోవచ్చు.

అయితే అది ఏమాత్రం సరిపోదు.కాబట్టే ఎముకలు దృఢంగా ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఓసారి చూద్దామా.

మన శరీరంలో ఎముకలలో ఉండే కాల్షియం స్థాయిని మెరుగుపర్చడానికి మనం పాలను ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.క్యాల్షియం పెంచడానికి కేవలం పాలు మాత్రమే కాదు నెయ్యి, పెరుగు వంటి పాల పదార్థాలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇది మాత్రమే కాకుండా ఉడకబెట్టిన గుడ్డును తీసుకోవడం ద్వారా కూడా మనకు విటమిన్ డి, క్యాల్షియం ఎక్కువ మోతాదులో సమృద్ధిగా దొరుకుతాయి.ఇక ఎవరైతే మాంసాహారం అలవాటు ఉందొ వారికి చేపలు కూడా ఎంతో మేలు చేస్తాయి.

అందులో ముఖ్యంగా ట్యూనా, సాల్మన్ జాతికి చెందిన చేపలు ఎంతో ముఖ్యమైనవి.వీటిలో ఎక్కువగా ఫ్యాటి ఆమ్లాలు అలాగే ఒమేగా 3 లు లభిస్తాయి.అయితే గుడ్లు, మాంసాహారం తినని వారు అయితే కూరగాయలు, పండ్లు తీసుకోవడం ద్వారా క్యాల్షియం పెంపొందించుకోవచ్చు.ఇక పాలు కూడా పడని వారు ఉంటే వారు డాక్టర్ల సలహా తీసుకొని సరైన చికిత్స తీసుకుంటే ఎముకలకు సంబంధించిన తీవ్రత నుంచి బయటపడవచ్చు.

ప్రజలు కేవలం ఇంటి లోపల లేదా ఆఫీస్ ఆవరణలో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు బయట సూర్యరశ్మిలో తిరుగుతుంటే శరీరానికి విటమిన్-డి ఎటువంటి ఖర్చు లేకుండా దొరుకుతుంది.దీంతో శరీరంలో ఎముకలకు సంబంధించిన వ్యాధులు నివారించేందుకు మనకు పరిష్కారం లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube