తమిళనాడు( Tamil Nadu ) రాష్ట్రంలో ఎంజి రామచంద్రన్ ( MG Ramachandran )బ్రతికున్నంత వరకు కూడా ఆయన చెప్పింది నడిచింది.సినిమాల్లో కానీ ఇటు రాజకీయాల్లో కానీ ఆయన మాట దాటి ఎవరు బ్రతికి బట్టకట్టి బయట పడింది లేదు.
ఆయన మనసు పడ్డ హీరోయిన్ తో పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేస్తూ ఉండేవారు జయలలిత ( Jayalalithaa )నుంచి ఎంతో మంది హీరోయిన్స్ ఆయన కాంపౌండ్ హీరోయిన్స్ గానే చలామణి అయ్యేవారు పేరుకు మూడు పెళ్లిళ్లు కానీ ఆయన జీవితంలో లెక్కలేనంత మంది ఆడవాళ్లకు స్థానం ఉంది.ఆయన తోటలో ఒక బంగ్లా ఉండేది.
అందులో నిత్యం హీరోయిన్స్ కి రాకపోకలు ఉండేవని అప్పట్లో తమిళనాడు మీడియా కోడై కూసింది.
ఇక ఆయన సినిమాల్లో మాత్రమే ఏ సదరు హీరోయిన్స్ ఎక్కువగా నటించేవారు వేరే సినిమాల్లో నటించాలంటే అందుకు ఎంజీఆర్ పరిమిషన్ ఖచ్చితంగా ఉండి తీరాలి.ఎవరైనా హీరో తనకన్నా అందంగా లేదా మంచి సినిమా తీస్తున్నాడు తన హీరోయిన్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.లేకపోతే తమిళనాడులోనే కాదు యావత్ దేశంలో ఎక్కడా కూడా అతడు ఆ సినిమాను తీయలేదు అంతలా ఎంజిఆర్ హవా నడిచింది ఆయన సినిమాలు పక్కన పెట్టి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా ప్రతి సినిమా పంచాయితీ అతడే చూసేవాడు.
ఎవరికి ఏం కావాలన్నా, ఏమి ఇవ్వకూడదు అన్నా కూడా ఎన్టీఆర్( NTR ) లోనే అన్ని జరిగేవి.
ఇక ఆ హీరోగా రజనీకాంత్ అప్పుడప్పుడే సినిమాల్లో నిలదొక్కు కుంటున్నాడు.ఆ సమయంలో లతా అనే హీరోయిన్ పై రజినీకాంత్ మనసు పారేసుకున్నారు అయితే అంతటితో ఆగకుండా తన ప్రేమ విషయం ఆ హీరోయిన్ ముందు పెట్టాడట అప్పటికే తమిళనాడుకు ఎంజీఆర్ ( MGR )ముఖ్యమంత్రిగా ఉన్నారు.దాంతో ఒకరోజు రజనీకాంత్ ను పిలిపించి లతా నా సొంత మనిషి.
ఇంకోసారి పిచ్చి వేషాలు వేస్తే భూమ్మీద లేకుండా చేస్తానని బెదిరించాడట.దాంతో అతడు మరోసారి ఏ హీరోయిన్ ప్రేమలో పడకుండా చివరికి లత అనే ఒక సాదారణ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ఇప్పటికీ ఆమెతోనే ఎంతో చక్కగా తన జీవితాన్ని గడుపుతున్నాడు.