స్నేహితులకు లేకపోతే సన్నిహితులకు ఇలా ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే మనం ఆ వస్తువును ఎలాంటి సందేహం లేకుండా వారికి ఇస్తూ ఉంటాం.ఇలా దాదాపు చాలామంది ప్రజలు చేస్తూ ఉంటారు.
అయితే కొన్నిసార్లు కొన్ని విషయాలను ఇతరులకు పంచడం లేదా ఎవరికైనా ధనం చేయడం కూడా హానికరం అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది.మన అదృష్టం కొన్ని వస్తువులతో ముడిపడి ఉంటుందని, మనం ఎవరికైనా ఈ వస్తువులను అప్పుగా ఇస్తే మన అదృష్టం కూడా ఆ వస్తువుతో పాటు వెళ్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.

ఇదే విషయాన్ని అనేక గ్రంథాలు, పురాణాలు వెల్లడించాయి.కొన్ని రకాల వస్తువులను అప్పుగా తీసుకోవడం లేదా దానం చేయడం ద్వారా ఆ వ్యక్తి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.బంధువులకు లేదా పొరుగువారికి ఇవ్వకూడని వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే పురాణ గ్రంథాలలో కలం ( Pen ) అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు.అంతే కాకుండా కలంతో అనేక పనులు ముడిపడి ఉంటాయి.ఒకరికి పెన్ను ఇవ్వడం లేదా వారి దగ్గర నుంచి తీసుకోవడం ద్వారా వ్యక్తి సంపాదించుకున్న ఫలం కూడా అవతలీ వ్యక్తికి వెళ్తాయని చెబుతారు.

అందుకే ఎవరూ తమ పెన్ను అప్పుగా ఇవ్వకూడదు.ఇంకా చెప్పాలంటే లక్ష్మీదేవి చీపురులో ( Broom ) నివసిస్తుందని ప్రజలను నమ్ముతారు.అందుకే చీపురు ఎవరికీ ఇవ్వడం మంచిది కాదని చెబుతారు.ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి.ఇంకా చెప్పాలంటే బియ్యం శుక్ర గ్రహానికి సంబంధించినవిగా ప్రజలు భావిస్తారు.ఎవరికైనా బియ్యం ( Rice ) శుక్రవారం దానం చేస్తే శుక్ర గ్రహ దోషం వస్తుందని చెబుతారు.
దీని కారణంగా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అలాగే ప్రతికూల శక్తి ఇంట్లో నివసిస్తుందని నమ్ముతారు.ముఖ్యంగా చెప్పాలంటే మీరు ధరించే దుస్తులను ఎవరికి ఇవ్వకూడదు.
అలా ఇవ్వడం వల్ల మీపై ప్రతికూల శక్తులు ప్రభావం చూపిస్తాయి.అలాగే దువ్వెనను కూడా ఎవరికి దానం ఇవ్వకూడదు.