ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.08
సూర్యాస్తమయం: సాయంత్రం.6.02
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: ఉ.10.22 ల11.25
దుర్ముహూర్తం: సా.4.25 ల5.13
మేషం:
ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.స్థిరస్తి క్రయ విక్రయలు లాభసాటిగా సాగుతాయి.సోదరుల నుంచి ఆకస్మిక ధనలాభాలు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
వృషభం:
ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నపటికీ అంచనాలు అందుకుంటారు.
ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.నూతన పనులు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.దైవ చింతన పెరుగుతుంది.
మిథునం:
ఈరోజు చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు.అనారోగ్య సమస్యలు వలన వ్యాపారములు కొంత మందగిస్తాయి.నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి.ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు.బంధు మిత్రులతో అకారణ మాటపట్టింపులు కలుగుతాయి.
కర్కాటకం:
ఈరోజు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.చిన్ననాటి మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు.ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.
సింహం:
ఈరోజు ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది.విలువైన వస్తువులు సేకరిస్తారు.దీర్ఘ కాలిక సమస్యలు నుండి బయటపడతారు.చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
కన్య:
ఈరోజు ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.గృహమున వివాహది శుభకార్యములు జరుగుతాయి.నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి.ఉద్యోగాలలో పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది.
తుల:
ఈరోజు స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి.వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు.వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.నూతన రుణాలు చేస్తారు.చేపట్టిన పనులలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.
వృశ్చికం:
ఈరోజు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు.నిరుద్యోగ ప్రయత్నలలో అవరోధాలు తొలగుతాయి.
నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి.సమాజంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.ధన పరంగా ఆశించిన పురోగతి పొందుతారు.
ధనుస్సు:
ఈరోజు ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.
వ్యయప్రయాసలతో కానీ కొన్ని పనులు పూర్తికావు.బంధు మిత్రులతో మీ మాటతో విభేదిస్తారు.
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు.
మకరం:
ఈరోజు రాజకీయ వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.చిన్ననాటి మిత్రుల నుంచి ధనలాభ సూచనలున్నవి.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.ఇంటా బయట బాధ్యతల నుండి కొంత ఉపశమనం పొందుతారు.
కుంభం:
ఈరోజు వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.దూరపు బంధువులు నుండి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి.ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది.ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
మీనం:
ఈరోజు ఇంటా బయట బాధ్యతలు చికాకు పరుస్తాయి.కుటుంబసభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి.ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తికావు.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.ఋణ ఒత్తిడి వలన మానసిక సమస్యలు పెరుగుతాయి.వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.