దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి.ఎండలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
ఈ ఎండల్లో ఒక్క గంట బయట తిరిగారంటే చాలు ముఖం దెబ్బకు డల్ గా కాంతిహీనంగా మారుతుంది.అటువంటి చర్మాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు ఎక్కడా లేని నిరుత్సాహం మనలోనే కనిపిస్తుంది.
అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీని కనుక పాటిస్తే క్షణాల్లో డల్ నెస్ ఎగిరిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బంగాళదుంప( Potato ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee Powder ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ యాక్టివేటెడ్ చార్కోల్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి.చివరిగా సరిపడా బంగాళదుంప జ్యూస్ ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై ప్యాక్ ను తొలగించి వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.తద్వారా చర్మం పై పేరుకుపోయిన మురికి, మృత కణాలు తొలగిపోతాయి.ఎండల దెబ్బకు డల్ గా మారిన చర్మం క్షణాల్లో కాంతివంతంగా, షైనీ గా మారుతుంది.
అలాగే సన్ టాన్ అయిన చర్మాన్ని రిపేర్ చేయడానికి కూడా ఈ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.కాబట్టి ఎండల కారణంగా డల్ గా మారిన చర్మాన్ని క్షణాల్లో మెరిపించుకునేందుకు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.