ఈ రోజుల్లో చాలా మంది ముప్పై ఏళ్లకే తెల్ల జుట్టు సమస్య( White Hair Problem )తో బాధపడుతున్నారు.పెరిగిన కాలుష్యం, మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, చెడు వ్యసనాలు తదితర కారణాల వల్ల జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.
ఫలితంగా జుట్టు తెల్లబడుతుంది.మీరు కూడా తెల్ల జుట్టు వస్తుందేమో అని భయపడుతున్నారా.? టెన్షన్ వద్దు ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ ను వాడితే ఏజ్ బార్ అయినా సరే మీ కురులు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తాయి.మరి ఇంతకీ ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ కొబ్బరి నూనె పోసుకోవాలి.ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు పొడి, రెండు టేబుల్ స్పూన్లు మునగాకు పొడి( Moringa Powder ) వేసి బాగా కలిపి చిన్న మంటపై పది నిమిషాల పాటు హీట్ చేయాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను చల్లార పెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం ఫిల్టర్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ ఆయిల్ లో రెండు టేబుల్ స్పూన్లు విటమిన్ ఈ ఆయిల్( Vitamin E Oil ), రెండు టేబుల్ స్పూన్లు బాదం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఒక బాటిల్ లో తయారు చేసుకున్న ఆయిల్ ను నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఈ మిరాకిల్ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి కాసేపు మసాజ్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ ను నైట్ అప్లై చేసుకుని మరుసటి రోజు తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గకుండా ఉంటుంది.ఫలితంగా తెల్ల జుట్టు దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.
ఈ ఆయిల్ ను వాడితే వయసు పైబడిన సరే కలర్స్ పై ఆధారపడాల్సిన అవసరం రాదు.అలాగే ఈ ఆయిల్ వల్ల జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్ అవుతాయి.
హెయిర్ ఫాల్ సమస్య సైతం కంట్రోల్ అవుతుంది.







