ప్రస్తుతం ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయి చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల సాయంత్రం అవ్వగానే చలి ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ తలుపులు మూసి ఇంట్లోనే ఉంటున్నారు.ఎందుకంటే ఈ కాలంలో ఎక్కువగా దోమలు ప్రజలను ఇబ్బంది కలగజేస్తున్నాయి.
దోమలు ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ప్రజలు కిటికీలు, తలుపులు మూసేసుకొని ఇంట్లోనే ఉంటున్నారు.దోమల నివారణకు కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల దోమలను తగ్గించుకోవచ్చు.
లేదంటే దోమలు కాటు వేయడం వల్ల చాలా రకాల విష జ్వరాలు వచ్చే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే 85% మంది జెన్యూ కారణాలవల్ల దోమ కాటుకు గురవుతున్నారు.
అంతేకాకుండా జీవక్రియ రేటు ఎక్కువగా ఉండి అధిగా కార్బన్ డయాక్సైడ్ విడుదల చేసేవారి చెంతకు దోమలు ఎక్కువగా చేరుతాయి.సెంట్లు కొట్టుకునే వారికి, చెమట సమస్యతో బాధపడే వారి దగ్గరకు దోమలు ఎక్కువగా వస్తాయి.
అంతేకాకుండా వారికి దోమలు ఎక్కువగా కుడతాయని ఒక అధ్యయనంలో తెలిసింది.

ఇంకా చెప్పాలంటే ఇంట్లోని కొన్ని రకాల ఆహార పదార్థాలను ఉపయోగించి దోమలను బయటకు పంపవచ్చు.వెల్లుల్లి వాసన కొంతమంది మనుషులకే కాకుండా దోమలకు కూడా ఇష్టం ఉండదు.వెల్లుల్లి మెత్తగా చేసి దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పెట్టడం వల్ల దోమలు పారి పోతాయి.
ఇంకా చెప్పాలంటే నిమ్మకాయ ముక్కల్లో లవంగాలు గుచ్చడం ద్వారా కూడా దోమలు దూరంగా వెళ్లిపోతాయి.ఇలా పెట్టిన చోట దోమలు అస్సలు రావు.తులసిని ఎంతో పవిత్రమైన మొక్కగా చాలామంది ప్రజలు భావిస్తారు.కానీ దోమలకు మాత్రం ఇది బద్ధ శత్రువు.
తులసి ఆకులను నీటిలో మరిగించి వాటిని గదిలో అక్కడక్కడ చల్లడం వల్ల దోమలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి.ఇంకా చెప్పాలంటే నీటిని ఒక స్ప్రే బాటిల్ లో ఉంచుకొని దోమలు ఉన్న ప్రదేశాల్లో స్ప్రే చేయడం వల్ల కూడా దోమలు బయటికి వెళ్లిపోతాయి.
తలుపులన్నీ మూసి కర్పూరం వెలిగించి 30 నిమిషాల వరకు తలుపులు మూసివేస్తే ఒక్క దోమ కూడా లోపల ఉండకుండా బయటకు వెళ్లిపోతాయి.