పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేస్తున్న సినిమాల్లో పాన్ ఇండియన్ మూవీ ‘ఆదిపురుష్’ (Adipurush) ఒకటి.బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut) తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఈ ఏడాది జనవరిలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు.రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు.ఇక బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon) సీతగా నటించింది.అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.
ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది.జూన్ 16న రిలీజ్ అవ్వనున్న ఈ సినిమా ఈ మధ్యనే ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేసింది.

ఇప్పటికే పలు పోస్టర్స్ తో పాటు టీజర్, ఫస్ట్ సింగిల్ వంటివి రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఉన్న నెగిటివిటీని పోగొట్టి పాజిటివ్ ఫీలింగ్ ఏర్పడేలా ప్రయత్నాలు చేస్తున్నారు.వీఎఫ్ఎక్స్ వర్క్ ని అప్ గ్రేడ్ చేసిన తర్వాత ఈ సినిమా ఇప్పుడిప్పుడే మంచి అంచనాలు నెలకొన్నాయి.మరి అంతా పాజిటివ్ గానే ఉన్న ఈ సమయంలో వరుస అప్డేట్స్ ఇచ్చి ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెంచడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా నెక్స్ట్ అప్డేట్ గురించి ఇప్పుడొక వార్త వైరల్ అవుతుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నెక్స్ట్ అప్డేట్ ఈ నెల 29న రాబోతున్నట్టుగా వార్తలు అందుతున్నాయి.మరి ఆ అప్డేట్ ఏంటో దేనికోసమో అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
జూన్ 16న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి.







