మోకాళ్ళ నొప్పులు.( Knee Pains ) ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
మోకాళ్ళ నొప్పులకు ప్రధాన కారణం ఎముకల బలహీనత.ఎముకలు( Bones ) బలహీనంగా మారడం వల్ల మోకాళ్ల నొప్పులే కాకుండా బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్, చిన్న చిన్న దెబ్బలకు ఎముకలు విరగడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.
కాబట్టి వాటికి దూరంగా ఉండాలి అంటే ఎముకలను బలోపేతం చేసుకోవడం ఎంతో అవసరం.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే పొడి చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ పొడిని ప్రతిరోజు కనుక తీసుకుంటే నెల రోజుల్లో మీ ఎముకలు గట్టిగా మారతాయి.మోకాళ్ల నొప్పులు పరారవుతాయి.
మరి ఎముకల ఆరోగ్యానికి సహాయపడే ఆ పొడిని ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు గుమ్మడి గింజలు( Pumpkin Seeds ) వేసి దోరగా వేయించుకుని తీసుకోవాలి.
ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు సబ్జా గింజలు,( Chia Seeds ) ఒక కప్పు అవిసె గింజలు( Flax Seeds ) వేసి వేయించుకొని తీసుకోవాలి.ఇప్పుడు ఈ మూడు గింజలు మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఆపై ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ప్రతిరోజు ఒక గ్లాసు మజ్జిగలో తయారు చేసుకున్న పొడిని వన్ టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని కలిపి తీసుకోవాలి.
గుమ్మడి గింజలు, సబ్జా గింజలు మరియు అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, మెగ్నీషియం, కాల్షియం, జింక్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.ఇవి బలహీనమైన ఎముకలను బలంగా, దృఢంగా మారుస్తాయి.ఎముకల్లో సాంద్రత పెరిగేలా ప్రోత్సహిస్తాయి.అవిసె గింజలు, సబ్జా గింజలు, గుమ్మడి గింజలు కలిపి పొడి చేసుకుని రోజు తీసుకుంటే ఎలాంటి మోకాళ్ల నొప్పులు అయినా కేవలం కొద్ది రోజుల్లోనే దూరం అవుతాయి.