ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో వివేక హత్య కేసు కీలకంగా మారిన సంగతి తెలిసిందే.ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల( YS Sharmila ) ఈ కేసు ఆధారం చేసుకుని ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హంతకులను ప్రభుత్వం కాపాడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.సరిగ్గా అదే సమయంలో వివేక హత్య కేసు పై మాట్లాడవద్దంటూ కడప కోర్టు( Kadapa Court ) ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది.
అయితే కడప న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను.షర్మిల సుప్రీంకోర్టులో( Supreme Court ) సవాల్ చేయడం జరిగింది.
ఈ క్రమంలో కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై.సుప్రీంకోర్టు స్టే విధించింది.
పూర్తి వాదనలు వినకుండా ఒకరి వాక్ స్వాతంత్రాన్ని.స్వేచ్ఛను ఎలా హరిస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై వైయస్ షర్మిల సోషల్ మీడియాలో స్పందించారు.“దురాత్ముల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా, మాడుపగిలేలా, వివేకానందరెడ్డి( Vivekananda Reddy ) గారి హత్య విషయంలో నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.భావప్రకటన స్వేచ్ఛపై ఈ రాక్షసమూక చేయబోయిన దాడిని తిప్పికొట్టి, ఎప్పటికైనా ధర్మపోరాటంలో చివరికి న్యాయమే గెలుస్తుందని నిన్న నిరూపణ అయ్యింది.అధికార బలాన్ని ఉపయోగించి, మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు చేసేవారికి ఈ స్టే చెంపపెట్టు.
ఈ విజయం తొలి అడుగు మాత్రమే.రాబోయే రోజుల్లో, వివేకకానంద రెడ్డి గారి కుటుంబానికి న్యాయం కోసం పోరాటం ఉధృతం చేస్తాము.
చిట్టచివరిగా విజయం, నిజం, న్యాయం వైపే ఉంటాయని చూపిస్తాం”.అంటూ పోస్ట్ పెట్టడం జరిగింది.