తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు మంచి గుర్తింపైతే ఉంది.ఆయన చేసిన సినిమాలు వైవిధ్యంగా ఉండటమే కాకుండా ఎలాంటి పాత్రనైనా పోషించగలిగే కెపాసిటీ ఉన్నట్టుగా కూడా ఆయన మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
మరి ఆయన చేసిన సినిమాలన్నీ భారీ విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్ళడమే కాకుండా హీరోగా విలన్ గా కరెక్టర్ ఆర్టిస్ట్ గా పలు రకాల బాధ్యతలను కూడా కొనసాగిస్తూ ముందుకు సాగుతూ ఉండడం మామూలు విషయం కాదు.ఇక ఇదిలా ఉంటే అతని వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కావాలని కోరుకున్నప్పటికి ఆయనకు సరైన సక్సెస్ అయితే రాలేదు.
కారణమేదైనా కూడా ఆయన ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు సరైన సక్సెస్ లేకపోవడంతో తన తోటి హీరోలతో పోటీ పడెంత రేంజ్ లో ఆయన సినిమాలను చేయలేకపోతున్నాడు.ఇప్పుడు 150 కోట్ల బడ్జెట్ తో చేస్తున్న కన్నప్ప(kannappa) సినిమాతో భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఈ సినిమా నుంచి ఈరోజు వచ్చిన టీజర్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.కేవలం ప్రభాస్ (Prabhas)షాట్స్ మాత్రమే హైలైట్ గా నిలిచాయి అంటే టీజర్ మొత్తం చాలా వరకు డల్ అయిందనే చెప్పాలి.
ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ ఇమేజ్ తోనే ఈ సినిమా ముందుకు నెట్టుకు రావాల్సిన అవసరమైతే ఉంది.